తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ వార్మప్​ మ్యాచ్​కు వాన అడ్డంకి - ind

భారత్​ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్​కు వరణుడు అడ్డు తగిలాడు. ప్రారంభమైన కొద్దిసేపటికే వాన రాకతో తాత్కాలికంగా మ్యాచ్ ఆగిపోయింది.

మ్యాచ్

By

Published : May 28, 2019, 3:35 PM IST

వేల్స్​ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వార్మప్​ మ్యాచ్​కు వర్షం అడ్డు తగిలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. రెండు బంతులు ఎదుర్కొన్న అనంతరం వాన రాకతో తాత్కాలికంగా మ్యాచ్​ ఆగిపోయింది. ఈ రెండు బంతుల్లో రోహిత్​(3), ధావన్(1) నాలుగు పరుగులు చేశారు.

ఔట్ ఫీల్డ్​ తడిగా ఉన్న కారణంగా అప్పటికే ఐదు నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది.

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వార్మప్​ మ్యాచ్​లో ఓడిపోయింది భారత్​. ఈ మ్యాచ్​లో నెగ్గి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్​ బరిలో దిగాలని భావిస్తోంది.

జట్లు..

భారత్..

విరాట్ కోహ్లీ(కెప్టెన్), లోకేశ్ రాహుల్, హార్దిక్ పాండ్య, ధోనీ(కీపర్), దినేశ్​ కార్తీక్​, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్​, కుల్దీప్ యాదవ్, షమీ, విజయ్ శంకర్​, కేదార్ జాదవ్, బుమ్రా, చాహల్

బంగ్లాదేశ్​..

మోర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్​, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, సౌమ్యా సర్కార్, ముష్ఫీకర్ రహీమ్, మొహమ్మదుల్లా, సబ్బీర్ రహమాన్, సైఫుద్దీన్, హసన్, ముస్తాఫిజర్ రహమాన్, రుబెల్ హుస్సేన్​, మిథున్, అబు జయేద్, హోస్సేన్

ABOUT THE AUTHOR

...view details