తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఈ సారి భారత్​ను కచ్చితంగా ఓడిస్తాం' - india

ప్రపంచకప్​లో భారత్​పై తమ పరాజయాలు ఈ ప్రపంచకప్​తో ఆగిపోతాయని పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్​ ఇంజిమామ్ ఉల్ హఖ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రతీ జట్టుకు వరల్డ్​కప్​ గెలిచేందుకు అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

ఇంజిమామ్

By

Published : May 26, 2019, 7:00 PM IST

ప్రపంచకప్​లో భారత్​ను ఓడిస్తామని పాకిస్థాన్ చీఫ్​ సెలక్టర్, మాజీ ఆటగాడు ఇంజిమామ్​ ఉల్ హఖ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. మాంచెస్టర్ వేదికగా జూన్ 16న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే పోరులో తమదే విజయమని ఇంజిమామ్ ధీమాగా ఉన్నాడు.

"ప్రపంచకప్​లో భారత్​పై మా పరాజయాలు ఈ మెగాటోర్నీతో ఆగిపోతాయి. ఈ సారి మా జట్టు తప్పక గెలుస్తుంది. వరల్డ్​కప్​ అంటే ఇండియా ఒక్కరితో ఆడితే సరిపోదు, ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమే. ప్రతి జట్టుకు ప్రపంచకప్​ గెలిచేందుకు అవకాశముంది. మా జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది" -ఇంజిమామ్ ఉల్ హఖ్, పాక్ చీఫ్ సెలక్టర్

జట్టులో మార్పులు గురించి మాట్లాడుతూ.. "అంతర్జాతీయ టోర్నీలు ఆడే జట్టు​ను కూర్చడంలో కొన్ని సమస్యలు సహజమే. ముఖ్యంగా ఫాస్ట్​ బౌలర్లను ఎంపిక చేయడంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా" అని తెలిపాడు. ప్రపంచకప్​లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, భారత్​, న్యూజిలాండ్ జట్లు సెమీస్ వరకు వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇప్పటివరకు ప్రపంచకప్​లో భారత్​, పాక్​ జట్లు ఆరుసార్లు తలపడగా.. ప్రతీ సారి విజయం భారత్​నే వరించింది. ఈ నెల 30న 12వ ప్రపంచకప్​ సీజన్ ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా ఆరంభంకానుంది.

ABOUT THE AUTHOR

...view details