తెలంగాణ

telangana

ETV Bharat / sports

యూట్యూబ్​లో రికార్డు సృష్టించిన ఇండియన్ సాంగ్ - pagal

యూట్యూబ్​లో దుమ్మురేపుతోంది హిందీ సాంగ్ 'పాగల్' . బాలీవుడ్ ర్యాపర్ బాద్​షా రూపొందించిన ఈ పాట 24 గంటల్లోనే 7 కోట్లకు పైగా వ్యూస్​తో ప్రపంచ రికార్డు సాధించింది.

బాద్​షా

By

Published : Jul 14, 2019, 10:05 PM IST

బాలీవుడ్ ర్యాపర్ బాద్​షా రూపొందించిన హిందీ సాంగ్ 'పాగల్'​ . ఈ ఆల్బమ్ యూట్యూబ్​లో దుమ్మురేపుతోంది. 24 గంటల్లో 75 మిలియన్ల(7 కోట్ల 50లక్షలు)కు పైగా వీక్షణలు అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది.

యూట్యూబ్​లో 5 కోట్ల వీక్షణలు దాటగానే "ఇది భారత్ సమయం" అంటూ బాద్​షా తన ఇన్​ స్టాలో పోస్ట్​ చేశాడు.

"ప్రపంచంపై ఆధిపత్యం చెలాయిస్తూ భారత్ దూసుకెళ్తోంది. ప్రస్తుత సమయం ఇండియాది. నా వీడియోను 5 కోట్ల మందికి పైగా చూశారు. నాకు మద్దతుగా నిలిచి, నాపై ఆదరాభిమానాలు చూపిన వారందరికీ కృతజ్ఞతలు" -బాద్​షా, బాలీవుడ్ ర్యాపర్.

జులై 10న విడుదలైన ఈ పాట ప్రస్తుతం వంద మిలియన్ల దిశగా దూసుకెళ్తోంది. అమెరికాలో పలు చోట్ల చిత్రీకరించిన ఈ గేయంలోని విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.

ఇది చదవండి: ఇంగ్లీష్ బౌలర్ల విజృంభణ- కివీస్ 241/8

ABOUT THE AUTHOR

...view details