తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ టీ20 ప్రపంచకప్​లో ఆడాలంటే ఇదే మార్గం: కపిల్​

భారత మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. టీ20 ప్రపంచకప్​లో చోటు దక్కించుకోవాలంటే ఏం చేయాలో సలహా ఇచ్చాడు దిగ్గజ క్రికెటర్​ కపిల్​ దేవ్​. ఐపీఎల్​ కాకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్​లు ఆడి ఫామ్​ నిరూపించుకోవాలని మహీకి సూచించాడు. మార్చి 2 నుంచి ధోనీ.. ఐపీఎల్ కోసం​ ప్రాక్టీస్​లో పాల్గొననున్నాడు.

MS Dhoni has to do this thing want to get place in T20 World Cup: Kapil Dev
ధోనీ టీ20 ప్రపంచకప్​లో ఆడాలంటే ఇదే మార్గం: కపిల్​

By

Published : Feb 28, 2020, 10:51 AM IST

Updated : Mar 2, 2020, 8:22 PM IST

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ధోనీ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భారత దిగ్గజం కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డాడు. గురువారం హెచ్‌సీఎల్‌ గ్రాంట్‌ ఈవెంట్‌ ఐదో ఎడిషన్‌లో పాల్గొన్న అతడు.. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కపిల్​దేవ్​-ధోనీ

" ఐపీఎల్‌లో ధోనీ ఒక్కడే ఆడట్లేదు. మరో పదేళ్లు మనం గర్వించే ఆటగాళ్లని చూడాలని కోరుకునే వాళ్లలో నేనొకడిని. నాకు తెలిసి దేశం కోసం ధోనీ ఇప్పటికే చాలా చేశాడు. ఒక అభిమానిగా అతను టీ20 ప్రపంచకప్‌లో ఉండాలనుకుంటున్నా. ఒక క్రికెటర్‌గా మాత్రం.. జట్టు యాజమాన్య నిర్ణయానికే కట్టుబడి ఉంటా. ధోనీ ఇప్పటికే చాలా కాలం ఆటకు దూరమయ్యాడు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే మెగా సమరంలో ఆడాలంటే ఇకపై చాలా మ్యాచ్‌లు ఆడాలి. ప్రస్తుతం అతని కెరీర్‌ చివరి దశలో ఉంది. ఒక అభిమానిగా ధోనీని ఐపీఎల్‌లో చూడాలని ఉన్నా.. కొత్త తరానికే ప్రాధాన్యత ఇస్తా"

-- కపిల్​దేవ్​, టీమిండియా క్రికెటర్​

గతేడాది వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా న్యూజిలాండ్‌ చేతిలో భారత్​ ఓడిపోయాక... మహీ ఆటకు దూరమయ్యాడు. అప్పట్నుంచి అతని భవితవ్యంపై అనేక వార్తలు వినిపించాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్‌ ప్రారంభమవుతుండగా, మార్చి 2 నుంచి ధోనీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టే అవకాశముందని తెలుస్తోంది.

Last Updated : Mar 2, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details