ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అఫ్గాన్ జ్టటుకు చుక్కులు చూపించింది. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో పరుగుల వరద పారించారు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్. ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ ఆకాశమే హద్దుగా చెలరేగగా... రికార్డులు ఉఫ్ మని చెరిగిపోయాయి. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు మోర్గాన్. 17 సిక్సర్లు కొట్టిన ఈ ఆటగాడు... ఇప్పటివరకు రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, డివిలియర్స్ పేరిట ఉన్న 16 సిక్సర్ల రికార్డును వెనక్కు నెట్టాడు. మోర్గాన్ దెబ్బకు ఇంగ్లీష్ జట్టు 50 ఓవర్లలో 397 పరుగులు చేసింది.
సిక్సర్ల మోత మోగించిన మోర్గాన్ - rashid khan
మాంచెస్టర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల రికార్డులు సృష్టించాడు. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మోర్గాన్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో భారత హిట్ మ్యాన్ రోహిత్‌శర్మను వెనక్కు నెట్టి చోటు దక్కించుకున్నాడు.
సిక్స్‌ల రికార్డులు బద్దలుగొట్టిన మోర్'గన్'
జట్టుగా ఇదే అత్యధికం..
వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డును చెరిపేసింది ఇంగ్లాండ్ జట్టు. గతంలో వెస్టిండీస్ టీం సాధించిన 24 సిక్సర్ల ఘనతను తన పేరిట నమోదుచేసుకుంది మోర్గాన్ సేన.
Last Updated : Jun 18, 2019, 9:30 PM IST