తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC 19: అర్ధశతకాలు చేసి ఔటైన జాసన్​, రూట్​ - root

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​ రాణిస్తున్నారు. జాసన్​ రాయ్, రూట్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ప్రొటీస్ బౌలర్లలో తాహిర్, ఫెహ్లూక్వాయో, రబాడా తలో వికెట్ తీసుకున్నారు.

ఇంగ్లాండ్

By

Published : May 30, 2019, 4:44 PM IST

లండన్ కెన్నింగ్టన్​ ఓవల్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​ సత్తాచాటుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లీషు జట్టులో జాసన్ రాయ్(54), జోయ్ రూట్(51)​ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.అనుకున్నట్టుగానే బ్యాటింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​పై ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు.

తొలి బంతికే వికెట్​..

ప్రపంచకప్​ 12వ సీజన్​లో తొలి బంతికే వికెట్ సమర్పించుకుంది ఇంగ్లాండ్. ప్రొటీస్ బౌలర్ ఇమ్రాన్ తాహిర్​ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికే బెయిర్​ స్టో ఔటయ్యాడు. కీపర్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు రూట్, జాసన్ రాయ్.

వీరిరువురు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించే దిశగా దూసుకెళ్లారు. ఆరంభంలో నిదానంగా ఆడినా.. తర్వాత ఇద్దరూ బ్యాట్​కు పనిచెప్పారు. 51 బంతుల్లో రాయ్ అర్ధశతకం సాధించగా... 57 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు రూట్. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జాసన్​ రాయ్.. ఫెహ్లూక్వాయో బౌలింగ్​లో వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే రబాడా బౌలింగ్​లో రూట్ కూడా ఔట్​ అయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details