తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భవిష్యత్తులో బుమ్రాను ఆపడం అసాధ్యం'

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్​లో నంబర్​ వన్​ బౌలర్​గా కొనసాగుతున్నాడు జస్​ప్రీత్​ బుమ్రా. టీమిండియా ఈ ప్రపంచకప్​ సెమీస్​ చేరడంలో కీలక పాత్ర పోషించాడీ మిస్టరీ బౌలర్​... డెత్​ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తాడు. అయితే బుమ్రా బౌలింగ్​ రహస్యం వెనుక కారణాలను వెల్లడించాడు శ్రీలంక పేసర్​ లసిత్​ మలింగ.

భవిష్యత్తులో బుమ్రాను ఆపడం అసాధ్యం

By

Published : Jul 6, 2019, 8:40 AM IST

వన్డే క్రికెట్​లో తనదైన బౌలింగ్​ శైలి, ప్రదర్శనతో ఆకట్టుకుంటోన్న టీమిండియా ప్రధాన పేసర్​ జస్​ప్రీత్​​ బుమ్రా... భారత జట్టుకు ఎన్నో విజయాలు అందిస్తున్నాడు. ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్​లను తన బౌలింగ్​తో గెలిచేలా చేస్తున్నాడు. డెత్​ ఓవర్లలో యార్కర్లు వేయడం బుమ్రాకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి ప్రత్యర్థులనైనా భయపెట్టగలడు. పరుగులు నియంత్రించడంలో దిట్ట. మరి బుమ్రా.. అంతటి నైపుణ్యం సంపాదించడానికి గల కారణాలను విశ్లేషించాడు శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ. వీరిద్దరూ ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మలింగ, బుమ్రా

" బుమ్రాను 2013లో కలిశాను. అప్పటికే అతడు పేస్‌ బౌలింగ్​ బాగా వేయగలడు. కానీ కచ్చితమైన లైన్​ అండ్​ లెంగ్త్​ బంతుల్ని వేయలేకపోయేవాడు. దీని కోసం బాగా శ్రమించాడు. టీ20ల్లో ప్రత్యేక నైపుణ్యం ఉంటేనే ప్రాముఖ్యత సంపాదించవచ్చనే విషయాన్ని తెలుసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఇన్‌ స్వింగ్​, ఔట్‌ స్వింగ్​ సహా స్లో బంతుల్ని వేయడం నేర్చుకున్నాడు. నెట్స్​లో సాధన చేసి అనుకున్నట్లు కచ్చితంగా మ్యాచ్​లో అమలు చేయగలుగుతాడు. అదే అతడిని ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా తయారుచేసింది ".
-- లసిత్​ మలింగ, శ్రీలంక బౌలర్​

ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురవ్వకపోవడం, ఓవర్​లో ఆరు బంతుల్ని యార్కర్లుగా వేయగలిగే సత్తా ఉండటం బుమ్రాకు బాగా కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు మలింగ. వచ్చే ఏడాది లోపు మ్యాచ్‌ పరిస్థితుల్ని సంపూర్ణంగా తెలుసుకుని ఎవరూ అధిగమించలేని స్థాయికి బుమ్రా చేరుకుంటాడని చెప్పుకొచ్చాడు లసిత్​.

ఐపీఎల్‌ 2019లో ముంబయి ఇండియన్స్​ తరఫున బరిలోకి దిగిన ఈ ఇద్దరు స్పీడ్​స్టర్​లు... ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి.. విజయంలో కీలకపాత్ర పోషించారు.

ABOUT THE AUTHOR

...view details