తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ - పాక్ మ్యాచ్​లో లవ్ ప్రపోజల్..! - india

ఈ నెల 16న మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్​ - పాక్ మ్యాచ్ మధ్యలో ఓ టీమిండియా అభిమాని తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

లవ్ ప్రపోజల్

By

Published : Jun 24, 2019, 10:31 AM IST

భారత్ - పాకిస్థాన్ మధ్య ఈ నెల 16న జరిగిన మ్యాచ్​ గురించిన వార్తలు, విశేషాలు ఇప్పటికీ హల్​చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ అభిమాని మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నప్పుడు తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

నీలిరంగు జెర్సీ ధరించిన ఓ యువకుడు వేల మంది ఉన్న స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. చివరికి అతడి ప్రేమను అంగీకరించి హత్తుకుంది. 45 సెకన్లపాటు సాగే ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

"అతడి ప్రేమ ప్లాన్ నాశనం చేయకుండా.. పాక్​పై గెలిచినందుకు టీమిండియాకు కృతజ్ఞతలు" అంటూ పోస్టులు చేశారు. "ఆకట్టుకునే ప్రపోజల్" అంటూ ఒకరు కామెంట్ చేశారు. "భారత్​ గెలుస్తుందని అతడికి ముందే తెలుసు అందుకే మ్యాచ్​ మధ్యలోనే ప్రపోజ్ చేశాడు" అని మరొకరు పోస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details