తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అలా వచ్చి ఇలా వెళ్లారు.. టార్గెట్ 137 - kiwis

కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో శ్రీలంక 136 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నే(52) మినహా మిగతావారు రాణించలేదు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్​ చెరో మూడు వికెట్లు తీశారు.

శ్రీలంక

By

Published : Jun 1, 2019, 5:37 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ మూడో మ్యాచ్​లో శ్రీలంక బ్యాట్స్​మెన్ చతికిలపడ్డారు. కార్డిఫ్ వేదికగా జరుగుతున్న పోరులో లంకేయులు 136 పరుగులకే ఆలౌటయ్యారు. కరుణరత్నే(52), కుశాల్​ పెరీరా(29) మినహా మిగతావారు రాణించలేదు. కివీస్ బౌలర్ మ్యాట్​ హెన్రీ ధాటికి లంక బ్యాట్స్​మెన్ వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్​ చెరో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక రెండో బంతికే తిరిమన్నె వికెట్​ కోల్పోయింది. అనంతరం కరుణరత్నే, కుశాల్ పెరీరా నిలకడగా ఆడారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుశాల్​ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు మ్యాట్​ హెన్రీ. అక్కడ నుంచి బ్యాట్స్​మెన్ వరుసగా విఫలమయ్యారు.

కరుణరత్నే ఒక్కడే..

46 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ఠ స్థితిలో ఉన్న శ్రీలంక.. 14 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ కరుణరత్నే, తిసారా పెరీరా(27) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 62 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా కరుణరత్నే క్రీజులో పాతుకుపోయాడు. 84 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.

కివీస్ బౌలర్లలో మ్యాట్​ హెన్రీ టాప్​ ఆర్డర్​ను కుప్పకూల్చాడు. తిరిమన్నె, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్​ను(0) ఔట్ చేయగా... ధనుంజయ డిసిల్వా(4), జీవన్ మెండిస్​(1)లను పెవిలియన్​ చేర్చాడు ఫెర్గ్యూసన్. ధాటిగా ఆడుతున్న తిసారా పెరీరాను వెనక్కి పంపాడు జేమ్స్ నీషమ్. ట్రెంట్ బౌల్ట్​, గ్రాండ్​హోమ్​, సాంట్నర్, జేమ్స్ నిషమ్​ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details