తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: టాస్ గెలిచిన కివీస్.. అప్గాన్ బ్యాటింగ్​ - kiwis

టాంటన్ వేదికగా అఫ్గానిస్థాన్​తో జరుగుతున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదుంది కివీస్. ఆడిన రెండింటిలోనూ పరాజయం చెందింది అఫ్గాన్.

అఫ్గాన్ - కివీస్

By

Published : Jun 8, 2019, 5:46 PM IST

ప్రపంచకప్​ పదమూడో మ్యాచ్​లోఅఫ్గానిస్థాన్​​తో తలపడుతున్న కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాంటన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో పిచ్​ బౌలింగ్​కు అనుకూలించే అవకాశముంది. అఫ్గానిస్థాన్ ష్టార్​ ఆటగాడు షెహజాద్ గాయం కారణంగా ప్రపంచకప్​కు దూరమయ్యాడు.

కివీస్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఊపుమీదుంది. శ్రీలంక, బంగ్లాదేశ్ పై విజయం సాధించింది న్యూజిలాండ్. అఫ్గాన్ ఆడిన రెండింటిలోనూ పరాజయం చెంది గెలుపుకోసం చూస్తోంది. ఆస్ట్రేలియా, శ్రీలంకపై ఓడిపోయింది అఫ్గాన్.

జట్లు

న్యూజిలాండ్..

కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్తిల్, మున్రో, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ లాథమ్, గ్రాండ్​హోమ్, మిషెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్​.

అఫ్గానిస్థాన్​..

గుల్బదిన్ నయీబ్(కెప్టెన్), నూర్ అలీ, హజ్రతుల్లా, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిదీ, మొహమ్మద్ నబీ, నజీబుల్లా, రషీద్ ఖాన్, ఇక్రామ్​, హమీద్ హసన్, అఫ్తాబ్ ఆలం

ABOUT THE AUTHOR

...view details