తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ క్రికెట్​ చీఫ్​ సెలక్టర్​గా ఇంజమామ్​ గుడ్​బై

ప్రపంచకప్​లో ఓటమి తర్వాత పాకిస్థాన్​ క్రికెట్​​ బోర్డు(పీసీబీ)లో మార్పులు మొదలయ్యాయి. పాక్​ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌ తన పదవికి నేడు రాజీనామా చేశాడు. బోర్డు ఆదేశిస్తే మరేదైనా కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.

పాక్​ క్రికెట్​ చీఫ్​ సెలక్టర్​ బాధ్యతలకు ఇంజమామ్​ గుడ్​బై

By

Published : Jul 18, 2019, 6:29 AM IST

ప్రపంచకప్​లో లీగ్​ దశలోనే నిష్క్రమించడం వల్ల పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు కీలక పదవులకు సెగ తగిలింది. ప్రస్తుతం పాక్​ చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న ఇంజమామ్‌ ఉల్‌ హఖ్‌ తన పదవి నుంచి బుధవారం వైదొలిగాడు. ఒకవేళ బోర్డు ఆదేశిస్తే మరేదైనా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

ఇంజమామ్​ పదవీ కాలం జులై 31తో ముగియనుంది. అయితే తన ఒప్పందాన్ని పొడగించుకొనేందుకు ఆయన సుముఖంగా లేనట్లు లాహోర్​లోని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు.

" మూడేళ్లకు పైగా చీఫ్​ సెలక్టర్​గా పనిచేశా. ప్రస్తుతం ఒప్పందాన్ని పునరిద్ధరించుకొనే ఆలోచన లేదు. సెప్టెంబర్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2020లో ఐసీసీ టీ20 వరల్డ్​కప్​, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జరగనున్నాయి. ఇన్ని మెగా ఈవెంట్లు ఉన్న సమయంలో పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు కొత్త చీఫ్​ సెలక్టర్​ను నియమించుకొంటే బాగుటుందని భావిస్తున్నా. తాజా ఆలోచనలతో ప్రయోగాలు చేసేందుకు వచ్చే వ్యక్తికి అవకాశం ఉంటుంది. పీసీబీ ఛైర్మన్​ ఇషాన్​ మనీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వసీమ్ ఖాన్‌ను కలిసి మాట్లాడాను. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపాను ".
--ఇంజమామ్‌, పాక్​ చీఫ్​ సెలక్టర్​

జట్టు విజయాల కోసం ఎంతో కృషి చేసినా ఫలితాలు పెద్దగా ప్రతిబింబించలేదని మాట్లాడాడు ఇంజమామ్. అభిమానులు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ... గడ్డుకాలం ఎదురైనా సారథి సర్ఫరాజ్‌, కోచ్‌ మికీ ఆర్థర్‌తో కలిసి ఒకే దిశగా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడీ మాజీ పాక్​ కెప్టెన్​.

ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు పేలవ ప్రదర్శనకు బోర్డు, సెలక్షన్‌ కమిటీ నిర్ణయాలే కారణమని ఆ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంజమామ్​ అధ్యక్షుడిగా జట్టు కూర్పుపై సరిగ్గా దృష్టి సారించలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగానే 2016వ సంవత్సరం మధ్యలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇంజమామ్​... దాదాపు మూడేళ్లకు ఆ పదవికి గుడ్​బై చెప్పేశాడు.

ABOUT THE AUTHOR

...view details