లీగ్ దశలో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు బుమ్రా. ఎనిమిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న సెమీస్ మ్యాచ్‌లోనూ బంతితో అద్భుత ప్రదర్శన చేసి ఓ రికార్డు నెలకొల్పాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గప్తిల్‌ను కేవలం 1 పరుగు వద్ద పెవిలియన్ చేర్చాడు బుమ్రా. మొదటి ఓవర్‌నే మెయిడిన్ చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక మెయిడిన్లు వేసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌లాడిన బుమ్రా తొమ్మిది మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఎనిమిది మెయిడిన్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.