తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధావన్​ బ్యాటింగ్​కు​ ఓకే... కానీ ఫీల్డింగ్​ కష్టమే'

గాయం నుంచి ధావన్​ కోలుకున్నప్పటికీ ఫీల్డింగ్​ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని టీమిండియా ఫీల్డింగ్​ కోచ్​ శ్రీధర్​ అభిప్రాయపడ్డాడు. జట్టు ఫీల్డింగ్​ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్టు తెలిపాడు.

By

Published : Jun 14, 2019, 12:05 PM IST

Updated : Jun 14, 2019, 12:31 PM IST

'ధావన్​ బ్యాటింగ్​ ఓకే... కానీ ఫీల్డింగ్​ కష్టమే'

భారత జట్టు సీనియర్​ ఓపెనర్ శిఖర​ ధావన్​ గాయంపై టీమిండియా ఫీల్డింగ్​ కోచ్​ శ్రీధర్​ స్పందించాడు. ధావన్​ కోలుకుని బ్యాటింగ్​ చేయగలిగినప్పటికీ... ఫీల్డింగ్​లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందన్నాడు. ముఖ్యంగా ధావన్​ స్లిప్​లో ఫీల్డింగ్​ చేయడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు.

"బంతిని విసరడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ గాయం ప్రభావం ఫీల్డింగ్​, క్యాచ్​లు పట్టే సమయంలో కచ్చితంగా ఉంటుంది.​ ఇన్నింగ్స్​ ఆరంభంలో ధావన్​ స్లిప్​లో ఎక్కువగా ఫీల్డింగ్​ చేస్తాడు. ఆ ప్రాంతంలో బంతి చాలా వేగంగా ఫీల్డర్​ చేతికి దూసుకెళుతుంది."

--- ఆర్​. శ్రీధర్​, భారత క్రికెట్​ ఫీల్డింగ్​ కోచ్​.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ధావన్ 117 పరుగులతో చెలరేగి ఆడాడు. ఆ సమయంలో ధావన్​ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. గాయం వల్ల ప్రపంచకప్​లో ధావన్​ స్థానంపై సందిగ్ధత నెలకొంది.​

'ఫీల్డింగ్​లో బుమ్రా మెరుగుపడ్డాడు'

బుమ్రా

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో బుమ్రా ఒకడు. అతడి బౌలింగ్​ నైపుణ్యంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ మిగితా జట్టు సభ్యులతో పోలిస్తే బుమ్రా ఫీల్డింగ్​ ప్రదర్శన కొంత తక్కువే. ఈ విషయంపై స్పందించిన శ్రీధర్​.. ఫీల్డింగ్​లో స్టార్​ బౌలర్​ ఎంతో మెరుగుపడ్డాడని అన్నాడు. తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి బుమ్రా ఎంతో శ్రమిస్తాడని ప్రశంసించాడు శ్రీధర్​.

"ఫీల్డింగ్​ అంశంలో బుమ్రా ఎంతో శ్రమిస్తాడు. 2016 నుంచి భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు బుమ్రా. అప్పటి నుంచి ఇప్పటివరకు అతడి ఫీల్డింగ్​ మెరుగుపరుచుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు." ​
--- ఆర్​. శ్రీధర్​, భారత క్రికెట్​ ఫీల్డింగ్​ కోచ్​.

భారత ఆటగాళ్ల ఫీల్డింగ్​ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నట్టు శ్రీధర్​ స్పష్టం చేశాడు. రోహిత్​, కోహ్లీ, జడేజా, హార్దిక్​ వంటి నైపుణ్యమైన ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందన్నాడు.

Last Updated : Jun 14, 2019, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details