ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​కు ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు ఇషాంత్​ దూరం! - పృథ్వీపై స్పష్టత

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ముంగిట టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్​ ఇషాంత్​ శర్మ గాయం కారణంగా మ్యాచ్​కు దూరమయ్యే అవకాశముంది. ఈ స్థానంలో ఉమేశ్​ జట్టులోకి రానున్నట్లు సమాచారం. యువ బ్యాట్స్​మన్​ పృథ్వీషా కాలిగాయం నుంచి కోలుకున్నాడని.. రెండో టెస్టుకు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి.

India vs New Zealand
భారత్​కు ఎదురుదెబ్బ... రెండో టెస్టుకు ఇషాంత్​ దూరం!
author img

By

Published : Feb 28, 2020, 2:19 PM IST

Updated : Mar 2, 2020, 8:49 PM IST

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు సిద్ధమవుతున్న కోహ్లీసేనకు ఊహించని దెబ్బ తగిలింది. ఇటీవలె చీలమండ గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన ఇషాంత్​.. మళ్లీ అదే నొప్పితో జట్టుకు దూరం కానున్నాడు. తాజాగా గాయం తిరగబెట్టడం వల్ల ప్రాక్టీస్​ సెషన్​కు హాజరుకాలేదు. తుది జట్టు ప్రకటించే సమయానికి ఈ పేసర్​ ఫిట్​గా లేకపోతే ఉమేశ్​ యాదవ్​ తుది జట్టులోకి వస్తాడు. తొలి టెస్టులో బౌలర్లంతా విఫలమైనా.. ఇషాంత్​ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

పృథ్వీపై స్పష్టత

ఇటీవల కాలికి కట్టుతో కనిపించిన యువ ఓపెనర్​ పృథ్వీషా.. రెండో టెస్టులో బరిలోకి దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ విషయంపై కోచ్​ రవిశాస్త్రి స్పష్టతిచ్చాడు. పృథ్వీ తుది జట్టులో ఉంటాడన్నాడు. ఫలితంగా ఈ మ్యాచ్​లోనూ శుభ్​మన్​ గిల్​కు చోటు దక్కే అవకాశం లేదు.

in article image
పృథ్వీ షా
Last Updated : Mar 2, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details