తెలంగాణ

telangana

ETV Bharat / sports

మిడిలార్డల్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..?

ప్రపంచకప్​లో భాగంగా జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్​లో నేడు టీమిండియా, బంగ్లాదేశ్​తో తలపడనుంది. మొదటి మ్యాచ్​లో ఓడిన కోహ్లీసేన ఈ మ్యాచ్​లో గెలుపుపై దృష్టిపెట్టింది.

మిడిలార్డల్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..?

By

Published : May 28, 2019, 9:18 AM IST

ప్రపంచకప్​ ముంగిట తన చివరి వార్మప్​ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. నేడు కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్​తో తలపడనుంది భారత్. మొదటి సన్నాహక మ్యాచ్​లో కివీస్ చేతిలో పరాజయం పాలైన కోహ్లీసేన ఈ మ్యాచ్​లో గెలిచి సానుకూల దృక్పథంతో ప్రపంచకప్​ను ప్రారంభించాలని అనుకుంటోంది. మిడిల్​ ఆర్డర్ బ్యాట్స్​మెన్ కేదార్ జాదవ్, విజయ్ శంకర్​ల గాయాలు జట్టును కలవరపెడుతున్నాయి.

బ్యాట్స్​మెన్​కు అనుకూలంగా ఉన్న పిచ్​లపై కివీస్​ బౌలింగ్​ చేతిలో తలవంచారు టీమిండియా బ్యాట్స్​మెన్. ట్రెంట్​ బౌల్డ్​ సీమ్​, స్వింగ్​ బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. భారత్​ను ఇబ్బందిపెడుతున్న సమస్యల్లో మిడిలార్డర్​ కూర్పు ఒకటి. నాలుగు, ఆరో స్థానంలో బ్యాటింగ్​కు ఎవరు రావలన్న విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ మ్యాచ్​లో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలని భావిస్తోంది యాజమాన్యం.

ప్రాక్టీసులో భారత ఆటగాళ్లు

విజయ్ శంకర్, కేదార్ జాదవ్ గాయంతో దూరమవగా వచ్చిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి మ్యాచ్​లో విఫలమైన రోహిత్, శిఖర్, కోహ్లీ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. బంగ్లా లెఫ్టార్మ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మన్​తో పాటు రుబెల్​ హసన్​ బౌలింగ్​ను టీమిండియా బ్యాట్స్​మెన్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం.

మొదటి ప్రాక్టీస్ మ్యాచ్​లో బ్యాటింగ్ ఆర్డర్​లో ముందొచ్చిన హార్దిక్ మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్ 5వ స్థానంలో రాగా ధోని ఆరవ స్థానంలో ఆడాడు. ఈ మ్యాచ్​లోనూ ఇదే ఆర్డర్​ కొనసాగిస్తారా అన్నది చూడాలి.

  • బంగ్లాదేశ్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఇవీ చూడండి...WC 19: 2015-రికార్డులు.. మెరుపులు..భావోద్వేగాలు

ABOUT THE AUTHOR

...view details