తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: వర్షం రావడమే మంచిదైంది

భారత్-న్యూజిలాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ ఆట కొనసాగనుంది.

మ్యాచ్

By

Published : Jul 10, 2019, 5:15 AM IST

కివీస్‌ ఇన్నింగ్స్‌ 47.1వ ఓవర్‌ వద్ద వర్షం ప్రారంభమైంది. వాన పెరిగితే పిచ్‌ పాడయ్యే అవకాశం ఉన్నందున వెంటనే ఆటను నిలిపివేశారు అంపైర్లు. మధ్య మధ్యలో వాన కాస్త తగ్గినా కొద్దిసేపటికే మళ్లీ ప్రారంభమైంది. మొదట 20 లేదా 25 ఓవర్లకైనా ఆట సాగుతుందని అంతా భావించారు. రాత్రి 11.05 గంటలకైనా మ్యాచ్ ప్రారంభంకావాల్సింది. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. రాత్రి 10.52కు ఆటను నిలిపివేస్తున్నట్లు రిఫరీ ప్రకటించారు.

మ్యాచ్ హైలెట్స్

మ్యాచ్​ రద్దయితే.. టీమిండియా తుదిపోరుకు

బుధవారం ఒక వేళ మ్యాచ్‌ సమయంలో మళ్లీ వర్షం పడితే కివీస్‌ ఇన్నింగ్స్‌ను అక్కడితోనే ముగించి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైనా డక్‌వర్త్‌ లూయిస్‌ వర్తిస్తుంది. అదీ జరగకుండా పూర్తిగా రద్దయితే మాత్రం లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది.

వర్షం రావడం మంచిదైంది..

మంగళవారం మళ్లీ వర్షం రావడమే టీమిండియాకు మంచిదైంది. మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే కోహ్లీసేన విజయానికి 148 పరుగులు చేయాల్సి ఉండేది. అప్పటికే పిచ్ స్లోగా ఉంది. వర్షం తర్వాత పేస్ బౌలర్లకు మరింత అనుకూలించే అవకాశం ఉంది. ఫలితంగా మ్యాచ్ కొనసాగినా కివీస్​కు కలిసొచ్చేది.

టీమిండియాకు ఇది రెండోసారి

ప్రపంచకప్‌లో భారత్‌ ప్రత్యర్థిగా ఉన్న ఓ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వాయిదా పడటం ఇది రెండోసారి. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చిన 1999 ప్రపంచకప్‌లో తొలిసారి ఇలా జరిగింది. బర్మింగ్‌హామ్‌లో మే 29న భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌ ఇలా జరిగింది. తొలి రోజు భారత 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమయ్యాక వర్షం వచ్చింది. మే 30న ఈ మ్యాచ్‌ను కొనసాగించారు. ఈ పోరులో భారత్‌ 63 పరుగుల తేడాతో గెలిచింది.

ఇవీ చూడండి.. 'సెమీస్​లో ఆసీస్​కు పరాభవం తప్పదు'

ABOUT THE AUTHOR

...view details