బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్...
10 ఓవర్లు వేసిన బుమ్రా 39 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అత్యల్ప సగటు 3.20తో పరుగులు ఇచ్చి స్వల్ప లక్ష్యం కాపాడటంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా భారత్ 50వ విజయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాద్ అందుకున్నాడు బుమ్రా.
2019-06-22 23:07:04
బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్...
10 ఓవర్లు వేసిన బుమ్రా 39 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. అత్యల్ప సగటు 3.20తో పరుగులు ఇచ్చి స్వల్ప లక్ష్యం కాపాడటంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా భారత్ 50వ విజయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాద్ అందుకున్నాడు బుమ్రా.
2019-06-22 22:59:38
హ్యాట్రిక్‌తో అదరగొట్టిన షమీ...
వరుస బంతుల్లో నబీ, అప్తాబ్, ముజీబ్ వికెట్లు సాధించాడు షమీ. 55 బంతుల్లో 52 పరుగులతో జోష్ మీదున్న నబీని ఆఖరి ఓవర్ మూడో బంతికి పెవిలియన్ చేర్చాడు షమీ. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడిన షమీ... హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటాడు.
2019-06-22 22:37:49
వరల్డ్ కప్‌లో బుమ్రాకు తొలి సిక్స్...
ఈ ప్రపంచకప్‌లో బుమ్రా బౌలింగ్‌లో తొలి సిక్స్ కొట్టాడు నబీ. 46వ ఓవర్ మూడో బంతిని అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు అఫ్గాన్ ఆల్‌రౌండర్ నబీ.
2019-06-22 22:33:08
కీలక సమయంలో వికెట్ తీసిన చాహల్...
46వ ఓవర్ వేసిన చాహల్ నబీ-రషీద్ జోడీని విడగొట్టాడు. ఊరిస్తూ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే క్రమంలో స్టంపౌట్ అయ్యాడు రషీద్. 16 బంతుల్లో 14 పరుగులతో రాణించాడు రషీద్ ఖాన్. మరో ఎండ్‌లో 42 బంతుల్లో 36 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
46 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు- 193/7
2019-06-22 22:29:48
45 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు- 185/6
మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. లక్ష్యం చిన్నబోతుండటం వల్ల నబీ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. 41 బంతుల్లో 35 పరుగులతో రాణిస్తున్నాడు నబీ. మరో ఎండ్‌లో రషీద్ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు.
2019-06-22 22:06:45
భాగస్వామ్యం విడగొట్టిన పాండ్యా...
23 బంతుల్లో 21 పరుగులతో రాాణిస్తోన్న నజీబుల్లాను ఔట్ చేశాడు పాండ్యా. 41వ ఓవర్ మూడో బంతికి డిఫెన్స్ ఆటబోయి చాహల్‌కు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు నజీబుల్లా. మరో ఎండ్‌లో నబీ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. 33 బంతుల్లో 27 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. నజీబుల్లా ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు రషీద్ ఖాన్.
42 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు- 169 పరుగులు (6 వికెట్ల నష్టానికి)
2019-06-22 21:46:36
40 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 157/5
36వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ 7 పరుగులు ఇచ్చుకున్నాడు. 37వ ఓవర్లో మూడు పరుగులు ఇచ్చాడు షమీ. 38వ ఓవర్ వేసి కుల్దీప్ మూడు పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. 39వ ఓవర్ వేసిన షమీ కాస్త పరుగులు ఇచ్చాడు. ఈ ఒక్క ఓవర్లో ఎనిమిది పరుగులు ఇచ్చుకున్నాడు. 40వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 6 రన్స్ కొట్టారు అఫ్గాన్ బ్యాట్స్మెన్లు.
నబీ 30 బంతుల్లో 25 పరుగులు, నజీబుల్లా 17 బంతుల్లో 16 పరుగులు సాధించాడు.
2019-06-22 21:39:10
చాహల్ ఖాతాలో వికెట్...
35వ ఓవర్ వేసిన చాహల్ ఆస్గర్ వికెట్ తీశాడు. 19 బంతుల్లో 8 పరుగులు చేసిన ఆస్గర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో నబీ 17 బంతుల్లో 15 పరుగులతో కాస్త బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. నజీబుల్లా క్రీజులోకి అడుగుపెట్టాడు.
35 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 స్కోరు చేసింది అఫ్గానిస్థాన్.
2019-06-22 21:33:15
33 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 121/4
32వ ఓవర్ వేసిన పాండ్య ఓ వైడ్ సహా ఆరు పరుగులు ఇచ్చాడు. అనంతరం చాహల్ వేసిన 33వ ఓవర్లో ఫోర్ సహా 5 పరుగుల వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో నబీ(8), అస్గర్(6) ఉన్నారు.
2019-06-22 21:20:23
31 ఓవర్లకు అప్గాన్ స్కోరు 110/4
30వ ఓవర్ వేసిన పాండ్య ఒక్క పరుగే ఇచ్చాడు. అనంతరం 31వ ఓవర్లో బుమ్రా 3 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో అస్గార్ అఫ్గాన్(4), మహ్మద్ నబీ(0) ఉన్నారు.
2019-06-22 21:10:42
నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గాన్
ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు బుమ్రా. 29వ ఓవర్ 4వ బంతికి రహ్మత్షాను ఔట్ చేసిన బుమ్రా.. చివరి బంతికి షాహిదిని(21) పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం స్కోరు 107/4
2019-06-22 21:07:22
బుమ్రా బౌలింగ్‌లో రహ్మత్ షా ఔట్
చాలా సేపటి తర్వాత ఇండియాకు వికెట్ దక్కింది. 29వ ఓవర్ నాలుగో బంతికి రహ్మత్ షాను(36) ఔట్ చేశాడు బుమ్రా. ప్రస్తుతం అఫ్గాన్ స్కోరు 106/3
2019-06-22 20:50:55
25 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 91/2
అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ రహ్మత్ (49 బంతుల్లో 25 పరుగులు) చేసి రాణిస్తున్నాడు. హస్మతుల్లా మరో ఎండ్‌లో 35 బంతుల్లో 17 పరుగులతో మంచి సహకారం అందిస్తున్నాడు.
అఫ్గాన్ విజయానికి మరో 134 పరుగులు అవసరం.
2019-06-22 20:40:51
21 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 76/2
అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ రహ్మత్ (42 బంతుల్లో 23 పరుగులు) చేసి రాణిస్తున్నాడు. హస్మతుల్లా మరో ఎండ్‌లో (18 బంతుల్లో 4 పరుగులు) మంచి సహకారం అందిస్తున్నాడు.
అఫ్గాన్ విజయానికి 29 ఓవర్లలో మరో 145 పరుగులు అవసరం.
2019-06-22 20:22:24
17 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 66/2
భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్న అఫ్గాన్ కెప్టెన్ గుల్బాదిన్ నైబ్‌ను ఔట్ చేశాడు హార్దిక్ పాండ్య. గుల్బాదిన్ నైబ్(42 బంతుల్లో 27 పరుగులు) సాధించి ఫెవిలియన్ చేరాడు. రహ్మత్ షా( 36 బంతుల్లో 17 పరుగులు) చేసి క్రీజులో ఉన్నాడు. హస్మతుల్లా మరో ఎండ్‌లో అడుగుపెట్టాడు.
అఫ్గాన్ విజయానికి 33 ఓవర్లలో మరో 159 పరుగులు అవసరం.
2019-06-22 19:58:52
10 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 37/1
భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు అఫ్గాన్ బ్యాట్స్మెన్లు. సారథి గుల్బాదిన్ నైబ్(24 బంతుల్లో 10 పరుగులు), రహ్మత్ షా( 12 బంతుల్లో 5 పరుగులు) చేసి క్రీజులో ఉన్నారు.
అఫ్గాన్ విజయానికి 40 ఓవర్లలో మరో 188 పరుగులు అవసరం.
2019-06-22 19:46:13
7 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు - 21/1
అఫ్గాన్ బ్యాట్స్మెన్లను పదునైన బంతులతో భయపెడుతున్నారు భారత పేసర్లు. 24 బంతుల్లో 10 పరుగులు చేసిన ఓపెనర్ హజ్రతుల్లాను తొలి వికెట్ రూపంలోపెవిలియన్ చేర్చాడు షమీ. మరో ఎండ్‌లో సారథి గుల్బాదిన్ 15 బంతుల్లో 4 పరుగులతో కొనసాగుతున్నాడు. రహ్మత్ షా 3 బంతుల్లో ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.
అఫ్గాన్ విజయానికి 43 ఓవర్లలో మరో 204 పరుగులు అవసరం.
2019-06-22 19:21:22
రివ్యూ కోల్పోయిన భారత్...
స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టు నెమ్మదిగా ఆడుతోంది. భారత పేసర్లను అడ్డుకుంటూ వికెట్లు కాపాడుకొంటున్నారు. హజ్రతుల్లా 16 బంతుల్లో 2 పరుగులు చేయగా, గుల్బాదిన్ 2 బంతుల్లో పరుగేమి చేయకుండా క్రీజులో ఉన్నాడు.
2.4 ఓవర్ వద్ద షమీ బౌలింగ్‌లో హజ్రతుల్లా ఎల్బీగా అప్పీల్ చేసింది టీమిండియా. కాని హజ్రతుల్లాను నాటౌట్‌గా ప్రకటించాడు అంపైర్. ఫలితంగా భారత జట్టు రివ్యూ కోల్పోయింది.
3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 6 పరుగులు చేసింది అఫ్గాన్ జట్టు.
2019-06-22 19:15:23
కేదార్ ఔట్...
68 బంతుల్లో 52 పరుగులతో రాణించిన కేదార్ 49.5వ ఓవర్ వద్ద ఔటయ్యాడు. నైబ్ మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
2019-06-22 18:29:58
బౌల్డ్ అయిన షమీ..
49వ ఓవర్ మూడో బంతికి షమీ ఔటయ్యాడు. 2 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. నైబ్ అద్భుతమైన బౌలింగ్‌తో షమీని బౌల్డ్ చేశాడు.
2019-06-22 18:26:50
నిరాశపరిచిన హార్దిక్...
అప్తాబ్ బౌలింగ్‌లో హార్దిక్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడీ హిట్టర్. క్రీజులోకి షమీ వచ్చాడు.
49 ఓవర్లలో భారత్ స్కోరు- 219 పరుగులు (6 వికెట్ల నష్టానికి)
2019-06-22 18:22:34
రాణిస్తోన్న కేదార్..
62 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు కేదార్ జాదవ్. మరో ఎండ్‌లో హార్దిక్ 6 బంతుల్లో 4 పరుగులతో కొనసాగుతున్నాడు.
48 ఓవర్లలో భారత్ స్కోరు- 213 పరుగులు (5 వికెట్ల నష్టానికి)
2019-06-22 18:13:43
ధోనీ స్టంపౌట్...
చివరి వరకు వికెట్లు కాపాడుకొని పరుగులు సాధించే ప్రయత్నంలో ధోనీ ఔటయ్యాడు. 52 బంతుల్లో 28 పరుగలతో ఉన్న ధోనీని స్టంపౌట్ చేశాడు ఇక్రమ్.
45 ఓవర్లలో భారత్ స్కోరు- 194 పరుగులు (5 వికెట్ల నష్టానికి)
2019-06-22 17:57:24
40 ఓవర్లకు 175 పరుగులు...
నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును నెమ్మదిగా నడిపిస్తున్నారు ధోనీ, కేదార్. మహీ 35 బంతుల్లో 22 పరుగులు చేయగా... కేదార్ 38 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
40 ఓవర్లలో భారత్ స్కోరు-175 పరుగులు (4 వికెట్ల నష్టానికి)
2019-06-22 17:42:01
డిఫెన్స్ ఆడుతున్న బ్యాట్స్మెన్లు...
కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత నెమ్మదిగా ఆడుతున్నారు ధోనీ, కేదార్. 26 బంతుల్లో 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు ధోనీ. 23 బంతుల్లో 12 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు కేదార్.
36 ఓవర్లలో భారత్ స్కోరు-152 పరుగులు (4 వికెట్ల నష్టానికి)
2019-06-22 17:20:15
మరో కీలక వికెట్ తీసిన నబీ...
62 బంతుల్లో 67 పరుగులతో ఉన్న కోహ్లీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న కోహ్లీని అఫ్గాన్ ఆల్‌రౌండర్ నబీ బోల్తా కొట్టించాడు. క్రీజులో ధోనీ, కేదార్ ఉన్నారు.
31 ఓవర్లలో భారత్ స్కోరు-136 పరుగులు (4 వికెట్ల నష్టానికి)
2019-06-22 17:03:42
ఎల్బీగా వెనుదిరిగిన శంకర్
41 బంతుల్లో 29 పరుగులతో ఉన్న విజయ్ శంకర్‌ను పెవిలియన్ చేర్చాడు అఫ్గాన్ బౌలర్ రెహ్మత్. కోహ్లీ 54 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. శంకర్ ఔటైన తర్వాత ధోనీ క్రీజులోకి వచ్చాడు.
27 ఓవర్లలో భారత్ స్కోరు-124 పరుగులు (3 వికెట్ల నష్టానికి)
2019-06-22 16:49:32
కెరీర్లో 52వ అర్ధశతకం...
రెండు వికెట్లు కోల్పోవడం వల్ల ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తన భుజాలపై వేసుకున్నాడు భారత జట్టు సారథి కోహ్లీ. 48 బంతుల్లో 50 పరుగులతో బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో రాణిస్తున్నాడు. మరో ఎండ్‌లో 21 బంతుల్లో 13 రన్స్‌తో కెప్టెన్‌కు సహకారం అందిస్తున్నాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్.
22 ఓవర్లలో భారత్ స్కోరు-98 పరుగులు (2 వికెట్ల నష్టానికి)
2019-06-22 16:29:56
19 ఓవర్లకు భారత్ స్కోరు 79/2
18వ ఓవర్ వేసిన నయిబ్ రెండు పరుగులు ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్లో నబీ 4 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విజయ్ శంకర్(7), విరాట్ కోహ్లీ(38) ఉన్నారు.
2019-06-22 16:18:15
16 ఓవర్లకు భారత్ స్కోరు 71/2
15వ ఓవర్ వేసిన నబీ రాహల్ వికెట్ తీసి రెండు పరుగులు ఇచ్చాడు. అనంతరం 16వ ఓవర్ వేసిన గుల్బదీన్ 5 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది కోహ్లీసేన
2019-06-22 16:04:29
నబీ బౌలింగ్‌లో రాహుల్ ఔట్
14వ రెండో బంతికి రాహుల్(30, 53 బంతుల్లో)ను ఔట ్ చేశాడు నబీ. రివర్స్ స్వీప్ ఆడబోయి హజ్రతుల్లాకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
2019-06-22 15:55:48
14 ఓవర్లకు భారత్ స్కోరు 64/1
13వ ఓవర్ వేసిన నబీ 4 పరుగులు ఇచ్చాడు. అనంతరం 14వ ఓవర్లో గుల్బదీన్ 5 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది కోహ్లీసేన
2019-06-22 15:52:22
12 ఓవర్లకు భారత్ స్కోరు 55/1
11వ ఓవర్ వేసిన ముజీబ్ ఫోర్ సహా 8 పరుగులు ఇచ్చాడు. అనంతరం 12వ ఓవర్లో గుల్బదీన్ 6 పరుగులు ఇచ్చాడు.
2019-06-22 15:46:18
10 ఓవర్లకు భారత్ స్కోరు 41/1
ముజీబ్ వేసిన 9వ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. అనంతరం పదో ఓవర్ వేసిన గుల్బదీన్ ఐదు పరుగులు వచ్చాయి. క్రీజులో కోహ్లీ(20), రాహుల్(20) ఉన్నారు.
2019-06-22 15:40:12
8 ఓవర్లకు భారత్ స్కోరు 34/1
ముజీబ్ వేసిన 7వ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. అనంతరం అప్తాబ్ ఆలం 8వ ఓవర్లో రెండు ఫోర్లు సహా 14 పరుగులు ఇచ్చాడు. క్రీజులో కోహ్లీ(15), రాహుల్(18) ఉన్నారు.
2019-06-22 15:32:14
ఆరు ఓవర్లకు భారత్ స్కోరు 18/1
ఐదో ఓవర్ వేసిన ముజీబ్.. రోహిత్(1) వికెట్ తీశాడు. ఆ ఓవర్లో రెండు పరుగులే వచ్చాయి. అనంతరం అఫ్తాబ్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు సహా 9 పరుగులు వచ్చాయి. కోహ్లీ(1), రాహుల్(9) క్రీజులో ఉన్నారు.
2019-06-22 15:24:29
ముజీబ్ బౌలింగ్ రోహిత్ ఔట్
భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఓవర్ రెండో బంతికే ముజీబ్ బౌలింగ్‌లో రోహిత్ బౌల్డయ్యాడు. అంతకు ముందు ఓవర్లోనూ పరుగులేమి రాలేదు. ప్రస్తుతం భారత్ స్కోరు 7/1
2019-06-22 15:15:34
మూడు ఓవర్లకు భారత్ స్కోరు 7/0
రెండో ఓవర్ వేసిన అఫ్తాబ్ ఆలం 3 పరుగులే ఇచ్చాడు. అనంతరం ముజీబ్ వేసిన మూడో ఓవర్లో ఒక్క పరుగే వచ్చింది.
2019-06-22 15:11:04
తొలి ఓవర్లో 3 పరుగులు చేసిన టీమిండియా
భారత్ బ్యాటింగ్ ప్రారంభమైంది. తొలి ఓవర్ వేసిన అఫ్గాన్ బౌలర్ ముజీబ్ 3 పరుగులు ఇచ్చాడు. క్రీజులో రోహిత్ శర్మ(1), రాహుల్(2) ఉన్నారు.
2019-06-22 15:01:51
తుదిజట్టులో ఆడేవాళ్లు వీరే..
జట్టులో ఓ మార్పు చెసింది భారత్. భువి స్థానంలో షమీ టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు అఫ్గాన్ రెండు మార్పులు చేసింది. నూర్ అలీ స్థానంలో హజ్రత్ అలీ రాగా.. దల్వాత్ బదులు అఫ్తాబ్‌కు అవకాశమిచ్చింది.
జట్లు
భారత్:
కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోనీ(కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, షమీ, చాహల్, బుమ్రా.
అప్గాన్:
గుల్బదీన్ నయీబ్(కెప్టెన్), హజ్రతుల్లా, రహ్మత్ షా, హష్మతుల్లా, అస్గర్ అప్గాన్, మహ్మద్ నబీ, నజీబుల్లా, రషీద్ ఖాన్, ఇక్రామ్ అలీ(కీపర్), అఫ్తాబ్ ఆలం, ముజిబుర్ రెహమాన్
2019-06-22 14:43:39
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆఫ్గాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ 28వ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనకులించే అవకాశముంది. వర్షం కురిసే అవకాశం తక్కువ.
ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది భారత్. కివీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అఫ్గాన్ పరాజయం చెందింది.
2019-06-22 14:13:30
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆఫ్గాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ 28వ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనకులించే అవకాశముంది. వర్షం కురిసే అవకాశం తక్కువ.
ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది భారత్. కివీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అఫ్గాన్ పరాజయం చెందింది.