పసుపు - నీలిరంగు జెర్సీలతోనే మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించింది శ్రీలంక జట్టు. దీనికి సంబంధించి ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది. పసుపు - నీలిరంగు జెర్సీలు ధరించి ఇంగ్లాండ్‌పై నెగ్గింది లంక జట్టు. ఫలితంగా ఆ జెర్సీలు తమ అదృష్టంగా భావిస్తోంది.
సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలు ధరించే శ్రీలంక తర్వాతి మూడు మ్యాచ్‌లకు పసుపు జెర్సీలను వాడనుంది.