తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో స్థానంలో హార్దిక్ ఎందుకో చెప్పిన కోహ్లీ - kohli press meet

ఆస్ట్రేలియా-భారత్ మధ్య పోరులో హార్దిక్​ పాండ్య చెలరేగి ఆడాడు.  ఎప్పుడూ ​ఆరో స్థానంలో వచ్చే హార్దిక్​ రెండో వికెట్​ పడిన వెంటనే వచ్చి ఆడాడు. తాజాగా ఈ మార్పుపై  సారథి కోహ్లీ వివరణ ఇచ్చాడు.

హార్దిక్​ పాండ్య ఎందుకు రెండో స్థానంలో వచ్చాడు..?

By

Published : Jun 11, 2019, 12:59 PM IST

Updated : Jun 11, 2019, 2:13 PM IST

ఆసీస్​తో మ్యాచ్​లో నాలుగో స్థానంలో ఎందుకు హార్దిక్​ను రప్పించాల్సి వచ్చిందో తెలిపాడు టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ. ఈ మ్యాచ్​లో విరాట్​ 88 పరుగులు (77 బంతుల్లో; 4ఫోర్లు, 2 సిక్స్​లు)చేశాడు. అయితే హార్దిక్​ బరిలో దిగే సమయంలో టీమిండియా 36 ఓవర్లకు 220 పరుగులు మాత్రమే చేసింది. అలాంటి సమయంలో హిట్టరైన హార్దిక్​ను దించాలని కోహ్లీ సూచించాడట. అది బాగా విజయవంతమైంది. పాండ్యా ఈ మ్యాచ్​లో 48 (27 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్స్​లు) చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ తక్కువగా స్ట్రైకింగ్​ చేస్తూ అవతలి బ్యాట్స్​మెన్​ పాండ్యకు స్ట్రైక్​ రొటేట్​ చేసేవాడు. చివర్లో వచ్చిన ధోనీ కూడా బ్యాట్​ ఝులిపించాడు. మహీ 27 పరుగులు (14 బంతుల్లో; 3 ఫోర్లు, 1 సిక్స్​)వేగంగా ఆడాడు. బ్యాటింగ్​ ఆర్డర్​ మార్చడం జట్టు ప్రణాళికలో భాగమని కోహ్లీ వెల్లడించాడు.

ఆస్ట్రేలియాపై పాండ్యా సూపర్​ ఇన్నింగ్స్​

" పాండ్యా అయితే దూకుడుగా ఆడతాడని తెలుసు అందుకే బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పు చేశాం. అనుకున్నట్లుగానే హార్దిక్​ ​ రాణించాడు. అర్ధశతకం పూర్తికాగానే దూకుడుగా ఆడతానని పాండ్యాతో చెప్పా. అయితే అతడు మాత్రం నువ్వు ఛాన్స్​ తీసుకోవద్దు నాకు బ్యాటింగ్​ ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలని కోరాడు. ఎందుకంటే అలాంటి సమయంలో వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇంకా 20 పరుగులు తక్కువే చేసేవాళ్లం. అవన్నీ ముందుగా ఊహించే హార్దిక్​ను దింపాం. ఎందుకంటే అతడైతే 200 స్ట్రైక్​తో బ్యాటింగ్​ చేయగలడు. నేను నెమ్మదిగా పరుగులు రాబడుతూ వికెట్లు కాపాడతాను అనుకున్నాను. అనుకున్నట్లే పాండ్యాకు ఎక్కువ బ్యాటింగ్​కు స్ట్రైక్​ రొటేట్​ చేస్తూ నేను నా టెంపో కొనసాగించా. చివరి ఐదు ఓవర్లలో నేను ఏ బంతి ఆడినా కచ్చితంగా సింగిల్​ తీసి హర్దిక్​కు ఇవ్వాలనుకున్నాను".
-- విరాట్​ కోహ్లీ, భారత జట్టు సారథి

అసలు ఆటలో ఈ విధంగా మార్పులు చేయడానికి మరో కారణమేంటంటే గతంలోనూ శ్రీలంకతో ఇదే మైదానంలో భారత్​ తలపడింది. 330 పరుగులు చేసినా టీమిండియా ఓటమి పాలైంది. అందుకే చివర్లో బాగా హిట్టింగ్​ చేసి పరుగులు సాధించాలని నిర్ణయించుకొన్నట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. చివర్లో ధోనీ కూడా స్కోరు బోర్డును పరుగులెత్తించాడని అందుకే 350 పరుగులకు పైగా చేయగలిగామని కోహ్లీ వివరించాడు.

హార్దిక్​పై స్టీవ్​వా​ ప్రశంసలు

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో హార్దిక్​ టీ20 ఆడినట్లు చెలరేగాడు. పాండ్య బ్యాటింగ్​ ఇన్నింగ్స్​పై ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్​ వా ప్రశంసలు కురిపించాడు.​ 1999 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికా ఆటగాడు లాన్స్​ క్లుజనర్​ ఇదే విధంగా హిట్టింగ్​ ఆడినట్లు చెప్పాడు. అదే ఆటతీరు ప్రస్తుతం హార్దిక్​ కొనసాగిస్తున్నట్లు చెప్తూ పాండ్యా​ గొప్ప ఆటగాడిగా కితాబిచ్చాడు. ఇలా ఆడితే ప్రత్యర్థి కెప్టెన్​కు అతడిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాదని చెప్పుకొచ్చాడు.

స్టీవ్​ వా
Last Updated : Jun 11, 2019, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details