తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అఫ్గాన్ క్రికెట్​ బోర్డు నాపై కుట్ర చేసింది' - world cup

గాయం కారణంగా ప్రపంచకప్ ​నుంచి వైదొలిగిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ ఆ దేశ క్రికెట్ బోర్డుపై విమర్శలు చేశాడు. తనను ఉద్దేశ్యపూర్వకంగా తప్పించారని మండిపడ్డాడు.

షెహజాద్

By

Published : Jun 11, 2019, 7:01 AM IST

ప్రపంచకప్​ నుంచి తనను కావాలనే తప్పించారని అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ హెహజాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పూర్తి ఫిట్​గా ఉన్నప్పటికీ కావాలనే జట్టు నుంచి తప్పించారని బోర్డుపై విరుచుకుపడ్డాడు. ఇందులో కెప్టెన్​తో సహా కొందరి కుట్ర ఉందని విమర్శించాడు.
ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్​ల అనంతరం షెహజాద్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు తనపై కుట్ర పన్నిందని ఘాటు విమర్శలు చేశాడు.

"నాకు ఎలాంటి గాయం కాలేదు. ఫిట్​నెస్ కారణంగా చూపి నన్ను జట్టు నుంచి తప్పించారు. నాకు తెలియకుండా బలవంతంగా తప్పుకోమన్నారు. న్యూజిలాండ్​తో మ్యాచ్​ ముగియగానే ఫోన్​కు మెసేజ్ వచ్చింది. గాయం కారణంగా ప్రపంచకప్​ నుంచి వైదొలిగినట్లు అందులో ఉంది. ఈ విషయం నాతో పాటు జట్టు సభ్యులకూ తెలియదు. ఆ వార్త విని వారందరూ షాక్​ అయ్యారు".
-మహ్మద్ షెహజాద్ , అఫ్గాన్ క్రికెటర్

అఫ్గాన్​ క్రికెట్ బోర్డు సీఈఓ అసదుల్లా ఖాన్ ఈ విషయమై స్పందిస్తూ.. షెహజాద్ చెబుతోంది పూర్తిగా అబద్ధమని తెలిపాడు. గాయానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ తమ వద్ద ఉందనీ.. దీనిని బట్టే ఐసీసీ తమకు ఇంకో ఆటగాడిని తీసుకోవడానికి అనుమతిచ్చిందని స్పష్టం చేశాడు. ప్రపంచకప్​ నుంచి వైదొలినందుకు అతడికి బాధగా ఉండవచ్చునని.. కానీ ఆటగాళ్ల ఫిట్​నెస్ విషయంలో రాజీ పడేది లేదని అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details