తెలంగాణ

telangana

ETV Bharat / sports

వెస్టిండీస్​​తో మ్యాచ్​- టాస్​ గెలిచి ఇంగ్లాండ్​ బౌలింగ్​

ప్రపంచకప్​లో ఇంగ్లాండ్- వెస్టిండీస్​ పోరుకు సౌతాంప్టన్​ వేదికైంది. టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా ఇంగ్లాండ్​ బరిలో దిగుతుండగా... జట్టులో మూడు మార్పులు చేసింది వెస్టిండీస్​ .

వెస్టిండ్​తో మ్యాచ్​- టాస్​ గెలిచి ఇంగ్లాండ్​ బౌలింగ్​

By

Published : Jun 14, 2019, 2:55 PM IST

Updated : Jun 14, 2019, 3:10 PM IST

సౌతాంప్టన్​ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఇంగ్లాండ్​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది.

ఇంగ్లాండ్​ జట్టులో మార్పులు లేవు. వెస్టిండీస్​ జట్టులోకి రసెల్​, లెవిస్​ తిరిగొచ్చారు. ఫాస్ట్​ బౌలర్​ గబ్రియల్​కు ప్రపంచకప్​లో తొలిసారి జట్టులో స్థానం లభించింది.

వెస్టిండీస్‌ జట్టు: క్రిస్‌ గేల్‌, లెవిస్​, షాయ్‌ హోప్‌, నికోలస్‌ పూరన్‌, షిమ్రోన్‌ హెట్మెయిర్‌, జేసన్‌ హోల్డర్‌, రసెల్​, బ్రాత్‌వైట్‌, షెల్డాన్‌ కోట్రెల్‌, ఒషానే థామస్‌, షాన్నొన్​ గబ్రియల్​.

ఇంగ్లాండ్​: జాసన్​ రాయ్​, జానీ బెయిర్​ స్టో, జోయ్​ రూట్​, ఇయాన్​ మోర్గాన్​(కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, జాస్​ బట్లర్​(కీపర్​), క్రిస్​ వోక్స్​, జోఫ్రా ఆర్చర్​, మార్క్​ ఉడ్​, లిమ్​ ప్లంకెట్, ఆదిల్​ రషీద్​​

ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ ఇంగ్లీష్ జట్టు 300కు పైగా పరుగులు సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్​మెన్ మంచి ఫామ్​లో ఉన్నారు. మెగాటోర్నీలో ఇప్పటికే జాసన్ రాయ్, జో రూట్, బట్లర్ సెంచరీలు సాధించి జోరు మీదున్నారు. మిడిలార్డర్​లో మోర్గాన్, స్టోక్స్​ రాణిస్తున్నారు.

బ్యాటింగ్​లో బలంగా కనిపిస్తున్నా... బౌలింగ్​లోని లోపాలు జట్టును కలవరపెడుతున్నాయి. ఆఖరు నిమిషంలో వరల్డ్​కప్ జట్టులో స్థానం దక్కించుకున్న జోఫ్రా ఆర్చర్​తో పాటు స్టోక్స్ రాణిస్తున్నా మిగతా వారి నుంచి వీరికి సహకారం లభించడం లేదు.

ఆడిన మొదటి మ్యాచ్​లో పాకిస్థాన్​ను 105 పరుగులకే కట్టడి చేసి ఘనవిజయం సాధించిన విండీస్ ఈ టోర్నీలో మంచి ఫామ్​లో ఉంది. అనంతరం జరిగిన ఆసీస్​తో మ్యాచ్​లోనూ పోరాడి ఓడింది. చివరగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్​ వర్షం కారణంగా రద్దు కాగా ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది కరీబియన్ జట్టు.

Last Updated : Jun 14, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details