ఇంగ్లాండ్‌కు చెందిన ఇయాన్ గౌల్డ్ అంపైరింగ్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక పోరే గౌల్డ్కు ఆఖరి మ్యాచ్. 2006లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అంపైర్‌గా అరంగేట్రం చేశాడు గౌల్డ్. అనంతరం నాలుగు ప్రపంచకప్‌లలో అంపైర్‌గా వ్యవహరించాడు. కెరీర్లో 74 టెస్టులు, 140 వన్డేలకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.
WC19: అంపైరింగ్‌కు ఇయాన్ గౌల్డ్ వీడ్కోలు - cwc 2019
ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించిన సీనియర్ ఆటగాళ్లు కొంతమంది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. మరికొందరు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఇదే కోవలోకి ఓ అంపైర్ కూడా చేరాడు. భారత్-శ్రీలంక మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌కు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించిన ఇంగ్లీష్ అంపైర్ ఇయాన్ గౌల్డ్... తన 13 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు.
అంపైరింగ్‌కు ఇయాన్ గౌల్డ్ వీడ్కోలు
2011 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ సెమీఫైనల్‌కు కూడా ఆయన అంపైర్‌గా పనిచేశాడు. క్రికెటర్ అయిన గౌల్డ్... 1983 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు వికెట్ కీపర్‌గా సేవలందించాడు. ఇంగ్లండ్ తరఫున గౌల్డ్ 18 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆటగాడిగా రిటైరయ్యాడు.