తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్ ప్రేక్షకులకు పండగే.. ఒకేరోజు మూడు ఫైనల్స్​ - world cup

ఆదివారం ఇంగ్లాండ్ ప్రేక్షకులకు పండగ చేసుకోనున్నారు. ఒకే రోజు ఏకంగా మూడు ఫైనల్స్ అక్కడ జరగనున్నాయి. ప్రపంచకప్ ఫైనల్​తో పాటు వింబుల్డన్ పరుషుల ఫైనల్, బ్రిటిష్ గ్రాండ్ ప్రీ ఫైనల్స్​ అభిమానులకు కనువిందు చేయనున్నాయి.

మ్యాచ్

By

Published : Jul 13, 2019, 9:45 PM IST

27 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్​ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం న్యూజిలాండ్​తో ఫైనల్​ మ్యాచ్​ ఆడనుంది. అదీ సొంతగడ్డపై జరుగుతున్న కారణంగా అభిమానులకు పండగే. అయితే ఇదే రోజు మరో రెండు ఫైనల్ మ్యాచ్​లు జరగనున్నాయి. క్రికెట్​ ప్రపంచకప్​ ఫైనల్​తో పాటు వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్, బ్రిటిష్ గ్రాండ్ ప్రీ ఫార్ములా రేసింగ్ ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్​లు ఒకేరోజు ఉన్నందు వల్ల ప్రేక్షకులు ఏది చూడాలో అని తలలు పట్టుకుంటున్నారు.

ఇంగ్లాండ్ x న్యూజిలాండ్

ఆదివారం లార్డ్స్​ వేదికగా జరిగే ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు వరల్డ్​కప్ టైటిల్ గెలవలేదు. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలన్న కసితో ఉన్నాయి. అయితే సొంత గడ్డపై జరుగుతుండటం ఇంగ్లాండ్​కు కలిసొచ్చే అంశం. ఫామ్ దృష్ట్యా మోర్గాన్ సేన టైటిల్​ ఎగరేసుకుపోతుందని క్రికెట్ పండితులు అంచనాలు వేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్ఠమైన జట్టును ఓడించి తుదిపోరుకు అర్హత సాధించిన కివీస్​ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అందువల్ల మ్యాచ్​ రసవత్తరంగా జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

జకోవిచ్‌ x ఫెదరర్‌

టెన్నిస్ పోరులో ఫెదరర్, జకోవిచ్, నాదల్ మధ్య పోటీ ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. అదీ వింబుల్డన్ అంటే మరింత ఆకట్టుకుంటుంది. వీరిలో ఏ ఇద్దరు తలపడినా అభిమానులకు పండగే. ఆదివారం జరగబోయే వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్​లో ఫెదరర్, జకోవిచ్ తలపడనున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బ్రిటిష్ గ్రాండ్ ప్రీ ఫైనల్​

ఆదివారం బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ ఫైనల్ జరగనుంది. సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌ వేదికగా సాగే ఈ పోటీలో బ్రిటిష్ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ బరిలో ఉన్నాడు. ఇప్పటికే ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన హామిల్టన్‌.. మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొట్టాస్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో హామిల్టన్‌ గెలిచి జిమ్ క్లార్క్‌, అలైన్ ప్రోస్ట్‌ పేరిట ఉన్న గత రికార్డును అధిగమించాలని భావిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details