భారత ఓపెనర్ రోహిత్‌శర్మ ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడు. 8 మ్యాచ్‌ల్లో 544 పరుగులతో దూసుకెళ్తున్నాడు. మరి ఇంతగా రాణిస్తోన్న ఆటగాడికి ప్రత్యర్థి జట్లు క్యాచ్‌లు వదిలేస్తూ ఎంతో లాభం చేకూరుస్తున్నాయి. అందుకే అతడి క్యాచ్‌లు వదిలేసిన ప్రతిసారీ.. హిట్‌మ్యాన్ సెంచరీ లేదా అర్ధ సెంచరీతో మెరుస్తున్నాడు.
- దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఒక పరుగు వద్ద క్యాచ్ విడిచిపెట్టడంతో రోహిత్ అజేయ సెంచరీ (122 నాటౌట్)తో చెలరేగాడు.
- ఆస్ట్రేలియాతో పోరులో 2 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడి అర్ధ సెంచరీ (57) సాధించాడు.
- ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగుల వద్ద రోహిత్ క్యాచ్‌ను వదిలేయగా.. అతడు సెంచరీ (102) సాధించాడు.
- మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరులోనూ 9 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రోహిత్ అందించిన క్యాచ్‌ను తమీమ్ విడిచిపెట్టాడు. ఫలితం.. రోహిత్ మరో సెంచరీ (104) సాధించాడు.