తెలంగాణ

telangana

ETV Bharat / sports

బొజ్జ గణపయ్య.. బ్యాటింగ్​ చేస్తున్నాడు - cricketer

వినాయకుడి విగ్రహాలను క్రికెటర్ల రూపంలో మార్చి ప్రార్ధిస్తున్నాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. చెన్నై అన్నానగర్​లో ఓ క్రికెట్ గణేశ్ మందిరాన్ని నిర్మించి పూజలు చేస్తున్నాడు. కీపర్, బ్యాట్స్​మెన్ రూపాల్లో ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తున్నాడు.

గణేశ్ టెంపుల్​

By

Published : Jul 7, 2019, 7:02 PM IST

అభిమానానికి హద్దు లేదు. ఇప్పటికే సినీతారలకు మందిరాలను కట్టే వారు, ఒంటి మీద పచ్చబొట్టు పొడిపించుకునే వారు.. ఆరాధించే వారి కోసం దేవుళ్లని మొక్కే ఫ్యాన్స్​ని ఇలా చాలామందిని చూసుంటాం. కానీ ఓ వ్యక్తి దేవుడినే క్రికెటర్ల​ రూపంలో మార్చి మరీ కొలుస్తున్నాడు. ఆటగాళ్ల రూపంలోని వినాయకుడి విగ్రహాలకు పూజలు చేస్తూ భారత్​ ప్రపంచకప్​ నెగ్గాలని ప్రార్థిస్తున్నాడు.

కే ఆర్ రామకృష్ణన్​

తమిళనాడుకు చెందిన కేఆర్ రామకృష్ణన్ అనే వ్యక్తికి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టం ఎంత వరకు వెళ్లిందంటే ఓ మందిరాన్ని నిర్మించేంత వరకు. క్రికెట్ గణేశ్ టెంపుల్​ పేరుతో నిర్మించిన ఈ గుడి చెన్నైలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆటగాళ్ల ఆకృతిలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించాడు.

క్రికెటర్ల రూపంలో వినాయకుడి విగ్రహాలు

అంతేకాదు క్రికెట్ మంత్రాలు చదువుతూ ఆ విఘ్నేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వినాయకుడు బ్యాటింగ్ చేసినట్టు, పీల్డింగ్ చేసినట్టు, షాట్ ఆడుతున్నట్టు ఉన్న విగ్రహాల ఆకృతులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

"నేను వినాయకుడి భక్తుడిని. గణేశుడి కోసం క్రికెట్ మంత్రాలను కూడా రూపొందించాను. మొత్తం 108 పద్యాలు ఉన్నాయి. క్రికెట్​ విఘ్నేశ్వరుడి కోసం భజనలు కూడా చేస్తాను. 2011 ప్రపంచకప్​ ముందు వికెట్​ కీపర్ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాను. ఈ విగ్రహం ధోనికి శక్తి ఇచ్చింది. 2011లో వరల్డ్​కప్ సాధించిపెట్టాడు మహీ" -కే ఆర్ రామకృష్ణన్​, క్రికెట్ గణేశ్ టెంపుల్ నిర్మాత

ఈ సారి భారత్​ తప్పకుండా ప్రపంచకప్ నెగ్గుతుందని, వినాయకుడి ఆశీర్వాదాలు ఉన్నాయని అతను చెబుతున్నాడు.

"ప్రస్తుతం భారత్​ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు. టీమిండియా తప్పకుండా వరల్డ్​కప్​ నెగ్గుతుంది. గణేషుని ఆశీర్వాదాలు మన జట్టుకున్నాయి" -కే ఆర్ రామకృష్ణన్​, క్రికెట్ గణేశ్ టెంపుల్ నిర్మాత

ఈ ప్రపంచకప్​ టోర్నీలో సెమీస్​ చేరిన భారత్​ 15 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మంగళవారం జరగబోయే సెమీస్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​తో తలపడనుంది.

ఇది చదవండి: హెలికాప్టర్ షాట్​ నేర్పిన మిత్రునికి ధోని ఏం చేశాడు?

ABOUT THE AUTHOR

...view details