తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక మ్యాచ్​లోనూ 'బామ్మ' హంగామా - భారత్-శ్రీలంక మ్యాచ్​

శ్రీలంక- భారత్ మ్యాచ్​లో 85 ఏళ్ల అభిమాని చారులత బామ్మ మరోసారి సందడి చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆమెకు టికెట్​ కొనిచ్చి.. ఓ సందేశాన్ని పంపాడు.

చారులత బామ్మ.. వచ్చింది మళ్లీ

By

Published : Jul 6, 2019, 5:57 PM IST

ప్రపంచకప్​లో టీమిండియాకు ఎంతమంది అభిమానులున్నా చారులత బామ్మ ప్రత్యేకం. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో కోహ్లీ, రోహిత్ బౌండరీలు బాదుతుంటే బూర ఊదుతూ ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. శనివారం భారత్- శ్రీలంక మ్యాచ్​కూ ఆమె హాజరయ్యారు. ఫొటోల్ని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ మ్యాచ్​ చూసేందుకుఆమెకు టికెట్​ బహుమతిగా ఇచ్చి ఓ సందేశాన్ని పంపాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.

"ప్రియమైన చారులతజీ, మీరు మాపై చూపిస్తోన్న ప్రేమ, అమితమైన ఇష్టం మాకు ఎంతో ప్రేరణనిస్తున్నాయి. మీ కుటుంబంతో మా ఆటను చూసి ఆనందించండి." -విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన భారత్.. సెమీస్​లో ఎవరితో తలపడుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ సెమీస్ చేరాయి. జూలై 14న లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్​ జరగనుంది.

ఇది చదవండి: అందరి కళ్లూ చారులతా బామ్మ వైపే...

ABOUT THE AUTHOR

...view details