టీమిండియా కోచ్, సపోర్ట్ స్టాఫ్ పదవులకు దరఖాస్తులకు ఆహ్వానించనుంది బీసీసీఐ. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి జట్టు సిబ్బంది తిరిగి కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పూర్తైన వీరి కాంట్రాక్టును ప్రపంచకప్ నేపథ్యంలో 45రోజులు పొడిగించింది బీసీసీఐ.
ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 3 వరకు వెస్టిండీస్‌తో టీ 20, వన్డే, టెస్ట్ సిరీస్ ఆడనుంది భారత్. ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, పీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తదితర సిబ్బంది ఒప్పందాన్ని పొడిగించింది.
"రెండు మూడురోజుల్లో ఈ పదవులకు సంబంధించిన దరఖాస్తులను వెబ్సైట్లో పొందుపరుస్తాం. టీమ్ మేనేజర్‌తో పాటు శిక్షణాసిబ్బంది, కోచ్ పదవులకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నాం" -బీసీసీఐ ప్రతినిధి.