టాంటన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 322 పరుగుల భారీ లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించేసింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ 5లోకి దూసుకెళ్లి పెద్ద జట్ల సరసన చేరింది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మరోసారి షకిబ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 2015లో స్కాంట్లాండ్‌పై 322 పరుగుల ఛేదనను సమం చేసింది బంగ్లాదేశ్. ఈ గెలుపు వన్డేల్లో మూడో అతిపెద్ద ఛేదనగా, ప్రపంచకప్‌లో రెండోదిగా పెద్ద ఛేదనగా ఘనత సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తమీమ్ ఇక్బాల్ 53 బంతుల్లో 48 పరుగులు, సౌమ్య సర్కార్ 23 బంత్లులో 29 పరుగులు చేసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.
అత్యధిక పరుగుల వీరుడు
తొలి వికెట్ అనంతరం బరిలోకి దిగిన షకిబ్ కెరీర్లో మరో శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో 99 బంతుల్లో 124 పరుగులతో(16 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. 2019 ప్రపంచకప్‌లో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు షకిబ్ వన్డేల్లో 9 సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు షకిబ్ అల్ హసన్. విండీస్‌పై మ్యాచ్‌లో బౌలింగ్‌లోనూ అదరగొట్టిన షకిబ్ 8 ఓవర్లకు 54 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
లిట్టన్ సిక్స్‌లు...