తెలంగాణ

telangana

By

Published : Jul 9, 2019, 9:44 AM IST

ETV Bharat / sports

ప్రపంచకప్​లో ఓటమితో బంగ్లా కోచ్​పై వేటు

ప్రపంచకప్​లో లీగ్​ దశలోనే బంగ్లాదేశ్​ జట్టు నిష్క్రమించడం వల్ల ఆ జట్టు ప్రధాన కోచ్​ స్టీవ్​ రోడ్స్​పై వేటు పడింది. అతడ్ని బాధ్యతల నుంచి తప్పించినట్లు వెల్లడించింది బంగ్లా క్రికెట్​ బోర్డు(బీసీబీ). మెగాటోర్నీలో జట్టు మెరుగైన ఆటతీరు కనబరచలేదనే అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచకప్​లో ఓటమికి బంగ్లా కోచ్​పై వేటు

మష్రఫీ మొర్తజా సారథ్యంలోని బంగ్లా జట్టు ప్రపంచకప్​లో 8వ స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్​లు ఆడిన ఈ జట్టు 3 విజయాలు సహా ఓ ఆట రద్దు వల్ల 7 పాయింట్లు సాధించింది. మెగాటోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్​, అఫ్గానిస్థాన్​ జట్లు మాత్రమే ఓడించి లీగ్​ దశలోనే నిష్క్రమించింది. ప్రపంచకప్​లో ప్రదర్శనపై విశ్లేషణ చేసుకున్న బంగ్లా క్రికెట్​ బోర్డు(బీసీబీ)... ప్రధాన కోచ్​ స్టీవ్​ రోడ్స్​పై వేటు వేసింది. అతడిని శిక్షకుడి బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రధాన కోచ్​ స్టీవ్​ రోడ్స్

"పాకిస్థాన్​తో మ్యాచ్​లో బంగ్లా ఓటమి తర్వాత ప్రదర్శనపై విశ్లేషణ చేసుకున్నాం. అందులో భాగంగానే స్టీవ్​ రోడ్స్​ను కోచ్​ బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం. బీసీబీ అతడితో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగించాలనుకోవట్లేదు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. శ్రీలంకతో త్వరలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కొత్త కోచ్​ నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ".
--నిజాముద్దీన్​ చౌదరి, బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ

రోడ్స్​ 2018లో బంగ్లా క్రికెట్​ జట్టు కోచ్​గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల కాలానికి బోర్డుతో అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వచ్చే ఏడాదికి ముగియనుండగా.. బీసీబీ, రోడ్స్​ పరస్పర అంగీకారంతోనే మధ్యలోనే బ్రేక్​ పడింది.

బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబ్​ అల్​ హసన్​ మినహా ఒక్కరూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. షకిబ్​ మాత్రం టోర్నీ మొత్తం అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. 606 పరుగులు, 11 వికెట్లతో ఆల్​రౌండర్​గా రాణించాడు. బంగ్లా జట్టు వచ్చే నెల నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ ఆడనుంది.

షకిబ్​ అల్​ హసన్

బంగ్లా బౌలింగ్​ కోచ్​లు వాల్ష్​, సునీల్​ జోషి, ఫిజియో చంద్రమోహన్​ కాంట్రాక్టులను రద్దు చేసే యోచనలో ఉంది బీసీబీ.

ABOUT THE AUTHOR

...view details