తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: టీమిండియా గెలుపు​ కోసం ప్రత్యేక చీర

న్యూజిలాండ్​పై సెమీస్​ గెలిచి.. భారత్​ ఫైనల్​ చేరాలని క్రికెట్​ ప్రియులు కోరుకుంటున్నారు. కోహ్లీ సేన విజయం కోసం.. దేశమంతా ప్రార్థిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే.. ఇందుకు విభిన్నంగా ఆలోచించాడో వ్యక్తి. టీమిండియా గెలుపు కోసం.. ప్రపంచకప్​ నేపథ్యంతో బనారస్​ చీరను నెలరోజులు కష్టపడి రూపొందించారు వారణాసి చేనేత కారులు.

By

Published : Jul 10, 2019, 11:24 AM IST

Updated : Jul 10, 2019, 12:29 PM IST

టీమిండియా గెలుపు​ కోసం బనారస్​ చీర..

ప్రపంచమంతా క్రికెట్​ వరల్డ్​కప్​ సందడి నెలకొంది. టీమిండియా ప్రపంచకప్​ గెలవాలని దేశవ్యాప్తంగా అభిమానులంతా కోరుకుంటున్నారు. కివీస్​తో సెమీఫైనల్​ గెలిచి.. భారత్​ ఫైనల్​ చేరాలని కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు. మరికొందరు ప్రత్యేకంగా కోహ్లీ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తికి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. టీమిండియా కోసం ఆశ్చర్యపరిచే విధంగా కొత్త బహుమతి ఇవ్వాలనుకున్నాడు. టీమిండియా బ్లూ జెర్సీతో పాటు.. క్రికెట్​ ప్రపంచకప్​ ట్రోఫీ డిజైన్లు, క్రికెట్​ బ్యాట్​, బంతులతో ప్రత్యేక బనారస్​ చీర రూపొందించారు ఉత్తర్​ప్రదేశ్​​ వారణాసికి చెందిన వ్యాపారవేత్త సర్వేశ్​. ఇందుకోసం 10 మంది చేనేత కార్మికులు నెల రోజులు కష్టపడ్డారు.

టీమిండియా గెలుపు​ కోసం ప్రత్యేక బనారస్​ చీర

చీర డిజైన్​లో దాదాపు 250కి పైగా వరల్డ్​కప్​ ట్రోఫీల్ని ముద్రించారు. ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో భారత్​ ధరించిన నారింజ జెర్సీ రంగును.. చీర అంచున డిజైన్​ చేసినట్లు తెలిపారు. భారత క్రికెట్​ను ప్రచారం చేయడానికి ఈ బనారస్​ చీరను రూపొందించారట. అంతేకాకుండా.. టీమిండియా ప్రపంచకప్​ గెలిస్తే బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నారు స్వతహాగా క్రికెటర్​ అయిన సర్వేశ్​.

Last Updated : Jul 10, 2019, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details