తెలంగాణ

telangana

ETV Bharat / sports

వర్షం కారణంగా బంగ్లా-శ్రీలంక మ్యాచ్​ రద్దు - బంగ్లాదేశ్​

ప్రపంచ కప్​ పోరు: బంగ్లా X శ్రీలంక

By

Published : Jun 11, 2019, 2:27 PM IST

Updated : Jun 11, 2019, 6:44 PM IST

2019-06-11 18:35:46

వర్షం కారణంగా బంగ్లా-శ్రీలంక మ్యాచ్​ రద్దు

ప్రపంచకప్​లో వరుసగా రెండో మ్యాచ్​కు వరుణుడు ఆటంకం కలిగించాడు. బ్రిస్టల్​ వేదికగా జరగాల్సిన శ్రీలంక-బంగ్లాదేశ్​ మ్యాచ్​ టాస్​ వేయకుండానే రద్దయింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్​ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అంప్లెర్లు. రద్దు కారణంగా రెండు జట్లకు చెరో పాయింటు లభించింది. శ్రీలంక 4 మ్యాచ్​లలో 4 పాయింట్లు, బంగ్లాదేశ్​ 4 మ్యాచ్​లలో 3 పాయింట్లతో ఉన్నాయి. 

సోమవారం(జూన్​ 10న).. సౌతాఫ్రికా- వెస్టిండీస్​ మధ్య మ్యాచ్​ కూడా వర్షం కారణంతో రద్దయింది. 

2019-06-11 14:09:17

బంగ్లాదేశ్​తో శ్రీలంక ఢీ

మొదటి మ్యాచ్​లో దక్షిణాఫ్రికా లాంటి జట్టుపై గెలిచి జోరుమీద కనిపించిన బంగ్లా ఆ తర్వాత అంత ప్రభావం చూపలేకపోయింది. ఓటమితో మెగాటోర్నీని ప్రారంభించిన లంక అనంతరం అఫ్గాన్​తో మ్యాచ్​లో గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ రెండు జట్ల మధ్య బ్రిస్టల్ వేదికగా నేడు మ్యాచ్​ జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. అయితే వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా వేయనున్నారు.

Last Updated : Jun 11, 2019, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details