తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​పై విరాట్ సేన విజృంభించేనా!

ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా 4 వరుస విజయాలతో జోరుమీదున్న భారత్ నేడు వెస్టిండీస్​తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

By

Published : Jun 27, 2019, 6:29 AM IST

Updated : Jun 27, 2019, 7:15 AM IST

టీమిండియా

ప్రపంచకప్​ హాట్ ఫేవరేట్​గా బరిలోకి దిగిన టీమిండియా అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్​లోనూ పరాజయం ఎరుగని కోహ్లీ సేన నేడు వెస్టిండీస్​తో తలపడనుంది. సెమీస్ అవకాశాలు చాలా తక్కువ ఉన్న విండీస్ పరువు నిలుపుకునేందుకు భారత్​ను ఢీ కొట్టనుంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

సెమీస్​పై గురిపెట్టిన భారత్​..

ఆడిన 5 మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచింది భారత్. న్యూజిలాండ్​తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి అగ్రస్థాయి జట్లను ఓడించి సెమీస్​పై కన్నేసింది. నేడు విండీస్​తో జరిగే మ్యాచ్​లో గెలిచి సెమీస్​ చేరేందుకు మరో అడుగు వేయాలనుకుంటుంది.

అందరి చూపు ధోనీపైనే...

అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ధోనీ బ్యాటింగ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 52 బంతులాడిన మహీ 28 పరుగులు మాత్రమే చేశాడు. ధోనీని ఎప్పుడూ వెనకేసికొచ్చే సచిన్​ తెందూల్కర్ సైతం అతని ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిడిల్ ఆర్డ్​ర్​లో కీలకమైన మహీ బ్యాటింగ్ స్థానాన్ని మార్చే అవకాశం లేకపోలేదు. స్నిన్నర్లతో నిండిన అఫ్గాన్​పై నిదానంగా ఆడిన ధోనీ.. విండీస్ ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగో స్థానంలో విజయ్​ శంకర్​కు బదులుగా రిషభ్ పంత్​కు అవకాశం కల్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి. అతడి దూకుడైన ఆటతీరు జట్టుకు అదనపు బలం చేకూరుస్తుందని పలువురు భావిస్తున్నారు.

విజయమే లక్ష్యంగా విండీస్​

ఆడిన 6 మ్యాచుల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచి.. 4 మ్యాచ్​ల్లో ఓడింది విండీస్. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి మూడో స్థానంలో ఉంది. సెమీస్ అవకాశాలు విండీస్ జట్టుకు చాలా తక్కువ.

ఈ మెగాటోర్నీలో చాలా మ్యాచ్​ల్లో చివరి వరకు వచ్చి ఓడింది వెస్టిండీస్. ఆసీస్​తో జరిగిన మ్యాచ్​లో 15 పరుగుల తేడాతో పరాజయం చెందగా.. కివీస్​తో కేవలం 5 పరుగుల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్​లో బ్రాత్​వైట్ శతకంతో ఒంటరి పోరాటం చేసి.. చివర్లో మ్యాచ్​ జారవిడిచాడు.

వెస్టిండీస్​ జట్టులో హిట్టర్లకు కొదవలేదు. క్రిస్ గేల్, షాయ్ హోప్, హిట్మైర్, బ్రాత్​వైట్ లాంటి విధ్వంసకర బ్యాట్స్​మెన్ ఉన్నారు. రసెల్ దూరం కావండం జట్టుకు ప్రతికూలంశం. బౌలింగ్​లో షెల్డన్ కాట్రెల్, థామస్ లాంటి ఆటగాళ్లు నిలకడగా రాణిస్తున్నారు.

తనదైన రోజున ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఛేదించే విండీస్​ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. 2016 టీ 20 ప్రపంచకప్​ భారత్​తో జరిగిన సెమీస్​ మ్యాచ్​లో 192 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్​మని ఊదేసింది కరీబియన్ జట్టు.

ప్రపంచకప్​లో భారత్ - వెస్టిండీస్ ముఖాముఖీ 8 సార్లు తలపడ్డాయి. 5 మ్యాచుల్లో టీమిండియా నెగ్గగా.. మూడు సార్లు కరీబియన్ జట్టును విజయం వరించింది.

ఇది చదవండి: 1992 ఫలితాలను పునరావృతం చేస్తోన్న పాక్​

Last Updated : Jun 27, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details