తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: అఫ్గాన్​కు దెబ్బ- టోర్నీకి షెహజాద్​ దూరం

ప్రపంచకప్​ ప్రారంభమైన వారానికే పసికూన అఫ్గానిస్థాన్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు​, విధ్వంసకర వికెట్​కీపర్ బ్యాట్స్​మన్​ మహ్మద్​ షెహజాద్​.. గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ఇక్రామ్​ అలీని జట్టులోకి తీసుకున్నారు.

By

Published : Jun 7, 2019, 3:31 PM IST

ప్రపంచకప్​కు​ అఫ్గాన్​ ఓపెనర్​ దూరం

ప్రపంచకప్​లో సంచలనాలు సృష్టిద్దామనుకున్న పసికూన అఫ్గానిస్థాన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్​ మహ్మద్​ షెహజాద్ మోకాలి​ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆడిన 2 మ్యాచుల్లో ఓడింది అఫ్గాన్. షెహజాద్​ దూరం కానుండటం వల్ల జట్టు మరింత బలహీనంగా మారనుంది.

ఇప్పుడిప్పుడే మంచి ప్రదర్శనలు చేస్తూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుందీ జట్టు. టీమ్​లో నాణ్యమైన స్పిన్నర్లకు తోడు దూకుడైన బ్యాట్స్​మెన్ ఉన్నారు. నబీ, రషీద్​ ఖాన్​ ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు.

ఐసీసీ ట్వీట్​...

2015 ప్రపంచకప్​ నుంచి అఫ్గాన్​ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఉన్నాడు షెహజాద్​. 55 ఇన్నింగ్స్​ల్లో 1,843 పరుగులు చేశాడు. ఇతడి స్థానాన్ని ఇక్రామ్​ అలీ ఖిల్​ భర్తీ చేయనున్నాడు. ఇందుకు ఐసీసీ అంగీకారం తెలిపింది. షెహజాద్​ ఫొటో షేర్​ చేస్తూ.. అతడిని మిస్​ అవుతున్నామని ట్వీట్​ చేసింది ఐసీసీ.

ప్రపంచకప్​కు ముందు పాకిస్థాన్​తో జరిగిన వార్మప్​ మ్యాచ్​లో షెహజాద్​కు గాయమైంది. అలాగే అఫ్గాన్​ ఆరంభ మ్యాచ్​లలో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియాపై డకౌట్​ అయిన ఈ ఓపెనర్.. లంకపై 7 పరుగులు చేసి వెనుదిరిగాడు.

జూన్​ 8న న్యూజిలాండ్​తో అఫ్గానిస్థాన్​ తన తదుపరి మ్యాచ్​ ఆడనుంది.

ఇదీ చూడండి:

ప్రపంచకప్​లో కౌల్టర్​నైల్ కొత్త​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details