తెలంగాణ

telangana

ETV Bharat / sports

జింబాబ్వే క్రికెట్ జట్టుపై ఐసీసీ నిషేధం - Zimbabwe suspended from international cricket

జింబాబ్వే క్రికెట్ జట్టుపై ఐసీసీ నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఫలితంగా ఏ టోర్నీలోనూ ఆ జట్టు ఆడేందుకు వీలులేదు.

జింబాబ్వే

By

Published : Jul 19, 2019, 10:40 AM IST

ఒకప్పుడు మంచి జట్టుగా పేరు తెచ్చుకుని అగ్రజట్లతో పోటీ పడిన జింబాబ్వే ప్రస్తుతం పేలవంగా తయారైంది. బోర్డుతో ఆటగాళ్లకు వివాదాలు, దేశంలో ఆర్థిక సంక్షోభం ఇందుకు కారణం.

తాజాగా జింబాబ్వే క్రికెట్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టును అంతర్జాతీయ క్రికెట్​ నుంచి సస్పెండ్​ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ప్రస్తుత క్రికెట్‌ బోర్డులోని సభ్యులను అక్కడి ప్రభుత్వ ఏజెన్సీ అయిన స్పోర్ట్స్‌ అండ్‌ రిక్రియేషన్‌ కమిటీ తొలగించడమే ఐసీసీ నిర్ణయానికి కారణం.

ఆర్టికల్‌ 2.4(సి) (డి) నిబంధనను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఫలితంగా ఐసీసీ నుంచి వచ్చే నిధులు ఆగిపోవడమే కాకుండా ఏ టోర్నీల్లోనూ ఆ జట్టు ఆడేందుకు వీలు లేదు. అయితే మూడు నెలల్లో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు సభ్యులను తిరిగి నియమించాలని గడువు విధించింది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్‌ కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.

ఇవీ చూడండి.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో మాస్టర్ బ్లాస్టర్​

ABOUT THE AUTHOR

...view details