వీరేంద్ర సెహ్వాగ్ వన్డేల్లో చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అధిగమించాలని యువరాజ్ తనను కోరినట్లు టీమ్ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ వెల్లడించాడు. 2013లో ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లో 209 పరుగులు చేసి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు హిట్‌మ్యాన్. సోమవారం భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో తొలి డబుల్ సెంచరీ తర్వాత జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నాడు రోహిత్.
"డబుల్ సెంచరీ చేసి వెనుదిరిగినపుడు.. 'నువ్వు మరో ఓవర్ ఆడి ఉంటే సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టేవాడివి' అని అన్నాడు యువీ. అప్పటికే డ్రసింగ్ రూమ్‌లో నాపై అంచనాలు చాలా పెట్టుకున్నారు. మరో 10 నుంచి 15 పరుగులు చేసి ఉండాల్సిందని.. యువీ, శిఖర్ ధావన్ అన్నారు".
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా వైస్ కెప్టెన్