ఎడమచేతి వాటం అంటేనే ఏదో ప్రత్యేకత. ఇతరులతో పోలిస్తే వారు భిన్నంగా, తెలివిగా ఉంటారని భావిస్తుంటారు. ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమ చేతివాటం వారి దినోత్సవం. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత గొప్ప ఎడమచేతి వాటం ఆటగాళ్లెవరో చెప్పాడు. నలుగురి చిత్రాలను పోస్ట్ చేశాడు. ఇంకా ఎవరినైనా మర్చిపోతే గుర్తు చేయాలని అభిమానులకు సూచించాడు.
యువీ ట్వీట్ చేసిన వారిలో ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్లు మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు చోటిచ్చాడు. తననెంతో ప్రోత్సహించిన టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని ప్రత్యేకంగా గౌరవించాడు.