టీమ్ఇండియా వికెట్‌కీపర్ రిషభ్‌పంత్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఉత్తరాఖండ్ చమోలీలో సంభవించిన జలవిలయంలో సహాయక చర్యల కోసం తన వంతు సాయం ప్రకటించాడు. తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తానని.. అవసరమైతే మరికొంత మందిని సాయం చేయాల్సిందిగా కోరుతానని పేర్కొన్నాడు.
ఉత్తరాఖండ్‌లో జరిగిన జలవిలయ ఘటనపై పంత్ విచారం వ్యక్తం చేశాడు. "సహాయక చర్యల కోసం నా మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకున్నాను. మరింత ఎక్కువ మందిని రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొంత మందిని సాయం చేయాలని కోరుతాను" అని పంత్ తెలిపాడు.