టీమ్ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా అతడు మనసు మార్చుకున్నాడు. మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇది టీమ్ఇండియాకు ఆడటానికి కాదు. తన రాష్ట్రం పంజాబ్‌ను దేశవాళీ టోర్నీలో విజేతగా నిలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపాడట యూవీ. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు.
"దేశవాళీ పోటీల్లో పంజాబ్‌కు ఆడటం ఎపుడూ సంతోషమే. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడం బాగుంటుంది. నేనూ, హర్భజన్.. పంజాబ్ టైటిల్ సాధించడానికి చాలా కష్టపడ్డాం. కానీ మా ఇద్దరి దురదృష్టవశాత్తు అది సాధ్యం కాలేదు. కెరీర్ చివర్లో నన్ను ఎవరూ ప్రోత్సహించలేదు. అదే నా రిటైర్మెంట్కు కారణమైంది. కానీ ఇపుడు పంజాబ్‌కు టీ20 టైటిల్ సాధించిపెట్టాలని అనుకుంటున్నా. ప్రస్తుతం జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. ఆ జట్టుకు ఆడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా."