వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఘనంగా ఆరంభమైంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఇంగ్లీష్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇయాన్ మోర్గాన్ తన ఖాతాలో అరుదైన రికార్డు వేసుకున్నాడు. ఆ దేశం తరఫున 200 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. పాల్ కాలింగ్‌వుడ్(197 వన్డేలు), జేమ్స్ అండర్సన్(194) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్.. మరో రికార్డు - #CWC19
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ఆ దేశం తరఫున 200 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ తరఫున ఘనత సాధించిన మోర్గాన్
మొత్తంగా 223 అంతర్జాతీయ వన్డేలు ఆడిన మోర్గాన్.. అందులో 23 వన్డేల్లో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గురువారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడీ బ్యాట్స్‌మెన్. మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లండ్ 100 మ్యాచ్‌లు ఆడి 61 మ్యాచ్‌ల్లో గెలిచింది.
ఇది చదవండి: WC19:దక్షిణాఫ్రికా బౌలర్ తాహిర్ సరికొత్త రికార్డు