ఇంగ్లాండ్ వేదికగా వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఘనంగా ఆరంభమైంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా. తొలి ఓవర్ వేసిన తాహిర్ ఈ మెగాటోర్నీలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌ల్లో పేసర్ బౌలింగ్‌ను ప్రారంభించేవారు. అందుకు భిన్నంగా ఒక స్పిన్నర్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన తాహిర్ తొలి ఓవర్ రెండో బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ బెయిర్‌స్టో(0)ని గోల్డెన్ డకౌట్ చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తాహిర్ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.