తెలంగాణ

telangana

ETV Bharat / sports

మనసు మార్చుకున్న గేల్​- విండీస్ కెప్టెన్ ఆనందం - వెస్టిండీస్ క్రికెట్ జట్టు

రిటైర్మెంట్​పై గేల్ మనసు మార్చుకోవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. అతడితో ఆడటం తమకు దక్కిన అదృష్టమని చెప్పాడీ క్రికెటర్.

గేల్ మనుసు మార్పు.. విండీస్ కెప్టెన్ ఆనందం

By

Published : Jun 27, 2019, 11:03 AM IST

ప్రపంచకప్​ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఇంతకు ముందు ప్రకటించాడు. కానీ రిటైర్మెంట్​పై మనసు మార్చుకున్నాడు ఈ విధ్వంసకర ఓపెనర్​. టీమిండియాతో స్వదేశంలో జరిగే సిరీస్​ తనకు చివరిదని బుధవారం వెల్లడించాడు. ఈ విషయం తెలిసి వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఆనందం వ్యక్తం చేశాడు.

"అవును, ఈ విషయం ఫిలిప్ (మీడియా మేనేజర్) నాకు చెప్పాడు. గేల్ దీని గురించి డ్రెస్సింగ్ రూంలో నాతో ఏం చర్చించలేదు. క్రిస్​ మైదానంలో ఉండటం నాకెంతో ఆనందం. ఇంకా ఆడేందుకు అతడికి అవకాశముంది. వెస్టిండీస్ జట్టుకు చాలా ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించే అదృష్టం గేల్​కు దక్కింది. అతడితో ఆడటం మాకు దక్కిన వరం" -జేసన్ హోల్డర్, వెస్టిండీస్ కెప్టెన్

జేసన్ హోల్డర్

ప్రస్తుత ప్రపంచకప్​లో 6 మ్యాచ్​లాడిన విండీస్.. కేవలం ఒకటి మాత్రమే గెలిచి సెమీస్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. గురువారం మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో తలపడనుంది.

ఇది చదవండి: విండీస్​పై విరాట్ సేన విజృంభించేనా!

ABOUT THE AUTHOR

...view details