బర్మింగ్హమ్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది న్యూజిలాండ్. సెంచరీతో చెలరేగిన కెప్టెన్ విలియమ్సన్విజయంలో కీలక పాత్ర పోషించాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్ రేసు నుంచి వైదొలిగింది.
242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 137 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ స్థితిలో ఓర్పుతో ఆడిన విలియమన్సన్- గ్రాండ్హమ్ ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించి కివీస్‌కు విజయాన్ని అందించారు . విలియమన్స్ 103 (నాటౌట్), గ్రాండ్హమ్ 60 (నాటౌట్) పరుగులు చేశారు.
సఫారీ బౌలర్లలో మోరిస్ 3 వికెట్లు తీశారు. ఎంగిడి, రబాడా, ఫెలుక్వాయో తలో వికెట్ దక్కించుకున్నారు.