కరోనా వైరస్ ప్రభావంతో క్రికెట్ టోర్నీలు రద్దయ్యాయి. ఫలితంగా క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. రెండున్నర నెలలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే కనీసం నాలుగు వారాల శిక్షణ అవసరమంటున్నాడు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్.
"మళ్లీ పూర్వ స్థితిలా ఫిట్నెస్ సాధించాలంటే కాస్త సమయం పడుతుంది. నాలుగు వారాల పాటు శిక్షణ అవసరం. మొదట కాస్త నెమ్మదిగా కసరత్తులు ప్రారంభించి తర్వాత పెంచుతూ పోవాలి. ప్రస్తుతం చెన్నైలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రాక్టీస్‌కు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. దాని గురించే ప్రయత్నిస్తున్నా. నెమ్మదిగా ప్రాక్టీస్ ప్రారంభిస్తా. ఇన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల జాంబీలా తయారయ్యా."