తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు..25 బంతుల్లో శతకం - ఇంగ్లండ్​ క్రికెట్​

ఇంగ్లండ్​ యువ ఆటగాడు విల్​ జాక్స్​ సంచలనం సృష్టించాడు. దుబాయ్​ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్​లో పాతిక బంతుల్లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సలు..25 బంతుల్లో శతకం

By

Published : Mar 22, 2019, 4:01 PM IST

సర్రే జట్టుకు ఆడుతోన్న ఇంగ్లీష్​ ఆటగాడు జాక్స్​ ఒకే ఓవర్​లో ఆరు సిక్సులతో చెలరేగాడు. 25 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ యువ కెరటం.. 8 ఫోర్లు, 11 సిక్సర్లతో మెరిశాడు. టీ10 మ్యాచ్‌లో ప్రత్యర్థి లాంక్‌షైర్‌ జట్టుపై పరుగుల వరద పారించాడు. ఫలితంగా 2013 ఐపీఎల్​లో గేల్​ చేసిన అత్యంత వేగవంతమైన శతకం రికార్డును తిరగరాశాడు. గేల్​ ఆ మ్యాచ్​లో 30 బంతుల్లో సెంచరీ చేశాడు.

  • బౌండరీలే లక్ష్యం...

ప్రారంభం నుంచే బౌండరీలతో విరుచుకుపడిన ఈ హిట్టర్​.. 30 బంతుల్లో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టీఫెన్​ పారీ వేసిన ఓ ఓవర్​లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదేశాడు. ఈ యువ ఆటగాడి జోరుకు తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోర్ చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన లాంక్​షైర్ 9.3 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details