తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జాంటీ రోడ్స్​ను అందుకే ఎంపిక చేయలేదు' - team india sanjay bangar

ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్​గా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్​ జాంటీ రోడ్స్​ను, టీమిండియా ఫీల్డింగ్​ కోచ్​గా ఎందుకు ఎంపిక చేయలేదో వెల్లడించారు బీసీసీఐ  సెలక్షన్​ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెస్కే  ప్రసాద్​. అతడి స్థానంలో ఆర్​.శ్రీధర్​ను ఎంపిక చేశారు సెలక్టర్లు.

'జాంటీ రోడ్స్​ను అందుకే ఎంపిక చేయలేదు'

By

Published : Aug 23, 2019, 4:29 PM IST

Updated : Sep 28, 2019, 12:22 AM IST

ప్రపంచకప్​ ఓటమి తర్వాత టీమిండియా కోచ్​, సహాయక సిబ్బంది కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది బీసీసీఐ సెలక్షన్​ కమిటీ. ప్రధాన కోచ్​ పదవి రవిశాస్త్రినే మళ్లీ వరించగా... ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌. శ్రీధర్‌నే తిరిగి ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్‌ దిగ్గజం జాంటీ రోడ్స్‌.. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి పోటీ పడినప్పటికీ సెలక్షన్‌ కమిటీ శ్రీధర్‌వైపే మొగ్గుచూపింది. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అండదండలతోనే శ్రీధర్‌ను మళ్లీ నియమించారని చర్చ జరుగుతోంది. రోడ్స్‌ను కనీసం తుది జాబితాలో చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది.

రోడ్స్​, శ్రీధర్​

సెలక్టర్​ వివరణ...

రోడ్స్​ను ఎంపిక చేయకపోవడంపై చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు.

" ఫీల్డింగ్‌ కోచ్‌ తుది జాబితాలో శ్రీధర్‌తో పాటు, అభయ్‌ శర్మ, దిలీప్‌ల పేర్లు అనుకున్నాం. ఎందుకంటే వీరికి భారత్‌-ఏ జట్టుతో పని చేసిన అనుభవం ఉంది. జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లోనూ సేవలందించారు. అందుకే రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు"
--ఎమ్మెస్కే ప్రసాద్‌, చీఫ్​ సెలక్టర్​

శ్రీధర్‌ ఒక అత్యుత్తమ ఫీల్డింగ్‌ కోచ్‌ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఎమ్మెస్కే. టీమిండియా ఫీల్డింగ్‌ మెరుగుపడేందుకు అతడు కృషి చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Last Updated : Sep 28, 2019, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details