తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డేలో రెడ్‌బాల్‌, టెస్టులో వైట్‌బాల్‌ ఎందుకు వాడరో తెలుసా?

క్రికెట్‌లో టెస్టు మ్యాచుల్లో రెడ్‌, వన్డేల్లో వైట్‌బాల్‌.. ఇలా వేర్వేరుగా ఎందుకు వాడతారు? వన్డేలో రెడ్‌బాల్‌, టెస్టులో వైట్‌బాల్‌ ఎందుకు వాడరో తెలుసుకుందాం?

Why are not used white ball ib test matches and red ball in ine day matches
వన్డేలో రెడ్‌బాల్‌, టెస్టులో వైట్‌బాల్‌ ఎందుకు వాడరంటే!

By

Published : Jun 3, 2020, 6:34 PM IST

వన్డే మ్యాచులు కొన్నిసార్లు రాత్రి సమయంలో ఫ్లడ్​లైట్ల కాంతిలోనూ.. ఆడాల్సి వస్తుంది. అప్పుడు వైట్‌బాల్‌ కనిపించినంత స్పష్టంగా రెడ్‌బాల్‌ కనిపించదు. ప్రొఫెషనల్‌ వన్డే మ్యాచులు పగటిపూట జరిగినా.. వైట్‌బాల్‌ మాత్రమే వాడతారు. రెడ్‌బాల్‌ కంటే వైట్‌బాల్‌ ఎక్కువ స్వింగ్‌ అవుతుంది అనే నమ్మకమే దీనికి కారణం. అలాగే టెస్టు మ్యాచుల్లో ఆటగాళ్లు తెల్లని క్రీడాదుస్తులు ధరిస్తారు. అందువల్ల టెస్టుల్లో రెడ్‌బాల్‌ వాడితే బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

అదే వైట్‌బాల్‌ వాడితే బౌలర్‌ చేతి నుంచి బంతి విడుదలైన తర్వాత దాని గమనాన్ని గుర్తించడానికి బాట్స్‌మెన్‌ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే రెడ్‌బాల్‌తో పోల్చుకుంటే వైట్‌బాల్‌ మన్నిక తక్కువ. త్వరగా దాని రూపుకోల్పోతుంది. అందుకే సుదీర్ఘంగా సాగే టెస్టుమ్యాచుల్లో వైట్‌బాల్‌ వాడటం సాధ్యం కాదు. ప్రస్తుతం రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగే టెస్టు మ్యాచుల్లో రెడ్‌బాల్‌ సరిగా కనిపించదు అన్న కారణంగా పింక్‌బాల్‌ను వాడుతున్నారు.

ఇవీ చూడండి:'ధోనీలో నాకు నచ్చే విషయం అదే..'

ABOUT THE AUTHOR

...view details