క్రికెట్.. ఈ పదానికి భారత్‌లో ఉన్నంత క్రేజ్ మరెక్కడా లేదు. మన దేశంలో ఉన్నంత మంది క్రికెట్ అభిమానులు మరెక్కడా ఉండరు. మ్యాచ్ వస్తోందంటే పనులు మానుకుని టీవీలకు అతుక్కుపోతారు. క్రికెట్లో అంతలా లీనమైపోయే అభిమానులు మ్యాచ్ తర్వాత బంతిని ఏం చేస్తారు అన్న విషయాన్ని మాత్రం దాదాపు పట్టించుకోరు. మరి ఆ బంతిని ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు జవాబు వెతికితే.. ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో బౌలర్ 5 లేదా 10 వికెట్లు తీసుకుంటే అతడు బంతిని తీసుకెళ్లొచ్చు. అదే ప్రత్యేకమైన మ్యాచ్ అయితే స్టేడియానికి చెందిన క్రికెట్ సంఘం ఆ బాల్‌ను వేలం వేస్తుంది. లేకపోతే జ్ఞాపకంగా దాచిపెడుతుంది.
సాధారణ మ్యాచ్‌ల్లో వినియోగించిన బంతులను నెట్స్‌లో ప్రాక్టీస్ కోసం వాడతారు.
బంతి కనుమరుగైనప్పుడు...
ఒకవేళ బంతి స్టేడియం బయటకు వెళ్లి కనిపించకుండా పోతే? గత మ్యాచ్‌లలో ఉపయోగించిన పాత బంతిని వాడతారు. అలా ప్రత్యామ్నాయంగా తెచ్చిన బంతి కూడా కనిపించకుండాపోతే మళ్లీ మరో పాత బాల్ని వినియోగిస్తారు. ఈ విషయంలో అంపైర్‌దే తుది నిర్ణయం.