ప్రపంచకప్ గెలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న జట్లలో వెస్టిండీస్ ఒకటి. 2016లో టీ20 ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు వన్డే ప్రపంచకప్‌పై కన్నేసింది. తాజాగా ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్లను ప్రకటించింది విండీస్ క్రికెట్ బోర్డు. హోల్డర్ సారథ్యం వహించనున్నాడు.
విండీస్ ప్రపంచకప్ జట్టు ఇదిగో..... - world cup
వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించింది విండీస్ క్రికెట్ బోర్డు. గేల్, రసెల్ చోటు దక్కించుకోగా గాయం కారణంగా నరైన్ జట్టుకు దూరమయ్యాడు.
వెస్టిండీస్ జట్టు
ఐపీఎల్లో సత్తా చాటుతున్న విండీస్ విధ్వంసకర ఆటగాళ్లు గేల్, రసెల్‌కు జట్టులో చోటు దక్కింది. గేల్‌కు ఇది 5వ ప్రపంచకప్. పొలార్డ్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. చేతి వేలు గాయం కారణంగా సునిల్ నరైన్ జట్టుకు దూరమయ్యాడు.
వెస్టిండీస్ జట్టు
జాసన్ హోల్డర్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, ఆష్లే నర్స్, బ్రాత్‌వైట్, క్రిస్ గేల్, డారెన్ బ్రావో, ఎవిన్ లూయిస్, ఫాబియాన్ అలెన్, కీమర్ రోచ్, నికోలస్ పూరన్, ఒషానే థామస్, షై హోప్, షానోన్ గాబ్రియాల్, షెల్డన్ కొట్రెల్, హెట్మెయర్
Last Updated : Apr 25, 2019, 10:56 AM IST