తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ దెబ్బకు విలవిల - ఇంగ్లాండ్

ఇంగ్లాండ్​తో స్వదేశంలో జరుగుతోన్న సిరీస్​లో ఆఖరి మ్యాచ్​ను గెలిచిన విండీస్ సిరీస్​ను 2-2తో సమం చేసింది. డాషింగ్​ ఓపెనర్​ క్రిస్​ గేల్ 77 పరుగులు సాధించాడు.

విజయానందంలో విండీస్ ఆటగాళ్లు

By

Published : Mar 3, 2019, 9:51 AM IST

ఇంగ్లాండ్​తో జరిగిన ఐదు వన్డేల సిరీస్​ను విండీస్ 2-2తో సమం చేసింది. ఆఖరి వన్డేలో గేల్, థామస్​ మెరిశారు. ఏడు వికెట్ల తేడాతో విండీస్​ విజయం సాధించింది. సిరీస్​లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్​లు గెలిచాయి. ఓ వన్డే వర్షం కారణంగా రద్దయింది.

వెస్టిండీస్-ఇంగ్లాండ్

ఒషానే థామస్ (21/5) విజృంభణతో బ్రిటీష్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. కరేబియన్ జట్టుపై ఇంగ్లాండ్​కు ఇదే అత్యల్ప స్కోర్. ఇంగ్లాండ్ చివరి 5 వికెట్లను కేవలం రెండు పరుగులకే కోల్పోవడం విశేషం.

ప్రపంచకప్ తర్వాత రిటైర్​మెంట్ ప్రకటిస్తానని తెలిపిన గేల్ 27 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది వెస్టిండీస్.
4 మ్యాచుల్లో 106 సగటుతో 424 పరుగులు సాధించిన గేల్​కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' లభించింది.

ABOUT THE AUTHOR

...view details