తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్లో ఓవర్ రేట్.. విండీస్ జట్టుకు జరిమానా

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ జట్టుకు జరిమానా విధించింది ఐసీసీ. మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

West Indie
వెస్టిండీస్

By

Published : Dec 16, 2019, 5:42 PM IST

Updated : Dec 16, 2019, 6:43 PM IST

చెన్నై వేదికగా భారత్​తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్​ ఘనవిజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా విండీస్​ ఆటగాళ్లకు జరిమానా విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). నిర్ణీత సమయం కంటే నాలుగు ఓవర్లు ఆలస్యమైనందున మ్యాచ్​ ఫీజులో 80 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ నిబంధన 2.22 ప్రకారం నిర్ణీత సమయం కంటే ఒక ఓవర్ ఆలస్యమైతే ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. టీమిండియాతో జరిగిన మ్యాచ్​లో నాలుగు ఓవర్లు ఆలస్యమైనందున 80 శాతం ఫీజు రూపంలో జరిమానా విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి.

ఇవీ చూడండి.. రెండో వన్డే కోసం విశాఖ చేరుకున్న భారత్-విండీస్

Last Updated : Dec 16, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details